లవంగాలు తినాల్సింది ఇప్పుడే.. ఎందుకో తెలుసా?

సమయం వచ్చినప్పుడు పెద్దలు చెప్పిన మాటలు వినాలి. వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి నిత్యం పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఈ జెనరేషన్ వాళ్లు ఎవరూ పట్టించుకోరు. కరోనా మహమ్మారి వచ్చింది కదా. వద్దన్నా అడిగి చెప్పించుకుంటున్నారు. అంతటి ప్రాముఖ్యత చెందిన ఇంగ్రీడియంట్స్లో లవంగాలు ఒకటి. మరి కరోనా టైంలో వీటిని తినడం వల్ల ఎంత మంచి చేకూరుతుందో ఓ సారి తెలుసుకోండి.
* కరోనా టైంలో కావల్సింది ఒకే ఒక్కటి రోగనిరోధక శక్తి. లవంగాలు ఆ శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.
* చర్మ సమస్యలతో బాధపడేవారికి లవంగాలు ఉపశమనాన్నిస్తాయి. ఆ సమయంలో లవంగాలను చందనంతోపాటు రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూతలా పూసుకుంటే చర్మ వ్యాధులు మాయమవుతాయి.
* లవంగాల నుంచి నూనె తీస్తారు. అలా నూనె తీయని లవంగాలు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* తెల్ల రక్తకణలను పెంపొందించే సత్తా లవంగాలకు ఉంది. ఇది మనిషి లైఫ్టైంని పెంచుతుంది.
* నోటి నుంచి చెడు వాసన వస్తుంటే రెండు లవంగాలను నోట్లో వేసుకోండి. అలా వేసుకుంటే నోరు తాజాగా ఉండడంతోపాటు మంచి సువాసన ఇస్తుంది.
* తిన్న ఆహారం జీర్ణం కాకపోతే లవంగాలు సేవించడం బెటర్. దీంతో జీర్ణం సాఫీగా జరుగుతుంది.
* లవంగాలు తింటే మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు ఐదు లవంగాలకు మించి శరీరంలోకి పంపకూడదు. లేదంటే శరీరంలో వేడి ఎక్కువవుతుంది.
* కఫం, పిత్త రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాలు సేవించేలా చూసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే ఫలితం ఉంటుంది.
తాజావార్తలు
- ముగిసిన బ్రహ్మోత్సవాలు
- ‘హాల్మార్క్' నిర్వాహకుల ఇష్టారాజ్యం
- టీఆర్ఎస్ నాయకుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా
- టీకా వచ్చేసింది.. ఆందోళన వద్దు
- మహమ్మారి అంతానికి నాంది
- తెలంగాణ భవన్ త్వరగా పూర్తి చేయాలి
- ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కృషి
- మెరిసిన గిరిజన విద్యార్థి
- కరోనా వ్యాక్సిన్ తయారీ గర్వకారణం
- వ్యాక్సిన్ సురక్షితం.. భయపడొద్దు