ఆదివారం 17 జనవరి 2021
Food - Aug 15, 2020 , 12:59:55

బాదం ప‌ప్పును నానబెట్టే తినాలా! లేదంటే ఏమ‌వుతుంది?

బాదం ప‌ప్పును నానబెట్టే తినాలా!  లేదంటే ఏమ‌వుతుంది?

రాత్రి నిద్ర‌పోయే ముందు గుప్పెడు బాదంప‌ప్పుల‌ను నీటిలో నాన‌బెట్టి ఒక మూత పెడితే స‌రిపోతుంది. ఉద‌యం లేచిన త‌ర్వాత వాటి మీద ఉండే తొక్కు తీసి తింటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని వైద్యులు నిత్యం చెబుతూనే ఉన్నారు. అయితే బాదం ప‌ప్పుల‌ను నాన‌బెట్టే తినాలా?  డైరెక్టుగా తిన‌కూడ‌దా? అనే సందేహాలు చాలామందిలో ఉండే ఉంటాయి. వాట‌న్నింటికీ స‌మాధాలున్నాయి. అవే ఇవి.

* బాదం ప‌ప్పుల‌ను నీటిలో నాన‌బెట్టడం వ‌ల్ల మ‌రింత రుచి చేకూరుతుంది. బాదంతొక్కు మీద టానిన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది శరీరంలోని పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుంది.

* అదే బాదంప‌ప్పును నాన‌బెడితే టానిన్ ప్ర‌భావం త‌గ్గి పోష‌కాలు చ‌క్క‌గా శ‌రీరానికి చేరుతాయి. నాన‌బెట్ట‌డం వ‌ల్ల తొక్క చాలా సులువుగా వ‌స్తుంది. 

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు గుప్పెడు బాదంప‌ప్పులు త‌ప్ప‌నిస‌రిగా తినాలి. అలా తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లిగి ఆహారం త‌క్కువగా తినేలా చేస్తుంది. ఇందులోని అసంతృప్తి కొవ్వులు ఆక‌లిని కూడా తగ్గిస్తుంది. 

* బాదం ప‌ప్పుల‌ను డైరెక్టుగా తిన‌డం క‌న్నా నాన‌బెట్టే తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరానికి ల‌భిస్తాయి. ఇది మ‌నిషిని య‌వ్వ‌నంగా ఉంచుతుంది. 

* బాదంలో బి7, ఫోలిక్ యాసిడ్లు ఉన్నాయి. ఇవి క్యాన్స‌ర్‌తో పోరాడుతాయి. అంతేకాదు పుట్టుక‌తో వ‌చ్చే లోపాల‌ను సైతం త‌గ్గిస్తుంది. 

* బాదం ప‌ప్పును సుమారు 8 గంట‌లు నానేలా చూసుకోవాలి. అందుకే రాత్రి స‌మ‌యంలో నాన‌బెట్టుకుంటే స‌రిపోతుంది. చూశారుగా బాదంప‌ప్పును నాన‌బ‌ట్టి తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలో..!