బుధవారం 05 ఆగస్టు 2020
Food - Jul 31, 2020 , 16:24:49

చిన్న‌పిల్ల‌ల‌కు ఎప్పుడు? ఎలా? ఈ పండ్ల‌ను తినిపించాలి!

చిన్న‌పిల్ల‌ల‌కు ఎప్పుడు? ఎలా? ఈ పండ్ల‌ను తినిపించాలి!

పుట్టిన బిడ్డ‌కు త‌ల్లిపాల‌కంటే శ్రేయ‌ష్క‌రం ఏదీ ఉండ‌దు. ఆరు నెల‌ల వ‌ర‌కు త‌ల్లిపాల నుంచి ల‌భించే పోష‌క విలుల‌పైనే బేబీ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆరు నెల‌లు దాటాక కూడా త‌ల్లిపాలే అంటే స‌రిపోదు. ఇత‌ర ఆహారం అందించాలి. హెల్తీఫుడ్‌ను బేబీకి అందించాలి. ఇందులో కావాల్సిన‌న్ని న్యూట్రిష‌న్ వాల్యూస్ అందుతాయి. లేదు బేబీకి సాలిడ్‌ఫుడ్‌ను ప‌రిచ‌యం చేయాల‌నుకుంటే ఈ పండ్ల‌ను ఎప్పుడు తినిపిస్తే మంచిదో తెలుసుకోవ‌డం ఉత్త‌మం. 

 ఆపిల్ : 6 నెల‌ల నుంచి 8 నెల‌ల పిల్ల‌ల‌కు ఆపిల్ తినిపించ‌వ‌చ్చు అని ఒక ప‌రిశోధ‌న‌లో తేలింది. అయితే డైరెక్టుగా కాకుండా ఆపిల్ మీదున్న తొక్కును తొలిగించి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌ర్వాత క‌ప్పు నీటిలో ముక్క‌లు వేసి బాగా ఉడికించాలి. 20 నిమిషాల వ‌ర‌కు హీట్ చేయాలి. ఉడికిన త‌ర్వాత మెత్త‌గా పేస్టులా చేసుకొని తినిపిస్తే ఇందులో ఉండే విటమిన్ ఏ, ఈ తో పాటు ఫోలేట్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం వంటి పోష‌కాలు అందుతాయి.

అవ‌కాడొ : అవ‌కాడో పెద్ద‌ల‌కే కాదు పిల్ల‌ల‌కు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఫ్రూట్ పిల్ల‌ల‌కు కావాల్సిన తగినంత ఎనర్జీని అందిస్తుంది. బాగా పండిన అవ‌కాడోను బాగా మెత్త‌గా గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం బ్రెస్ట్ మిల్క్ ను గాని లేదంటే ఫార్ములా మిల్క్ ను గానీ యాడ్ చేయాలి. దీన్ని ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పండులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్ అలాగే జింక్ లభిస్తాయి.

పియర్స్ : పియ‌ర్స్ ఇమ్యూన్ సిస్టంను డెవ‌ల‌ప్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరు నుంచి ఎనిమిది నెలలలోపు పిల్ల‌ల‌కు పియర్స్ ను తినిపించ‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్‌, కాప‌ర్‌, విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తాయి. బేబి గ‌నుక జీర్ణ‌సమస్యల‌తో బాధపడుతున్నట్ల‌యితే పియర్స్ ను తినిపించమని డాక్ట‌ర్లు స‌ల‌హా ఇస్తున్నారు. బాగా పండిన పియ‌ర్స్‌ను మెత్త‌గాచేసి బేబీకి తినిపించాలి. 

క్యారెట్ : బేబీకి తినిపించాల్సిన సాలిడ్ ఫుడ్‌లో క్యారెట్ ప్ర‌త్యేకం. బేబీ కంటిచూపు మెరుగుప‌ర్చ‌డానికి, స్కిన్‌ను అందంగా మార్చ‌డానికి అలానే ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంకా ప‌ళ్లు రాని పిల్ల‌ల‌కు క్యారెన్ ఉడికించి మెత్త‌గా చేసిన గుజ్జును తినిపించాలి. ఇందులో ఫార్ములా మిల్క్‌ను జోడిస్తే కావాల్సిన క‌న్సిస్టెన్సీలోకి వ‌స్తుంది. అదే పిల్ల‌ల‌కు దంతాలు వ‌స్తే మెత్త‌టి క్యారెట్‌ను ముక్క‌లు చేసి ఇచ్చినా ప‌ర్వాలేదు.  

స్వీట్ పొటాటో : తొక్కు తీసిన స్వీట్ పొటాటోల‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి. త‌ర్వాత వాటిని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో ఫార్ములా మిల్క్‌ని క‌లిపి ప‌ల్చుగా చేసి బేబీకి తినిపిస్తే స‌రిపోతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు కేల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి. 

అన్నం :  సాలిడ్ ఫుడ్‌లోకి పండ్లుతో పాటు అన్నం కూడా వ‌స్తుంది. పండ్లు వాటిక‌న్నా త‌ల్లిదండ్రులు ముందుగా అన్నానికే ప్రాముఖ్య‌త ఇస్తారు. మ‌జ్జిగలో అన్నం వేసి మెత్త‌గా గుజ్జులా చేసి తినిపిస్తే ఇష్టంగా తింటారు. అంతేకాదు బాగా జీర్ణం కూడా అవుతుంది. కొంత‌మంది పిల్ల‌లు పాలు అన్నం కాంబినేష‌న్‌ను ఇష్ట‌ప‌డుతారు.  

అరటిపండ్లు : ఐదు నెలలు దాటిన బేబీకి అరటిపండ్లను పెట్ట‌వ‌చ్చు. ఇందులో పొటాషియం పుష్క‌లంగా దొరుకుతుంది. దీంట్లోని కార్బోహైడ్రేట్స్ ద్వారా బేబీని ఎన‌ర్జీగా ఉంచుతుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. పండుప‌డిన అర‌టిపండును ఫోర్క్ సాయంతో గుజ్జులా చేసి పిల్ల‌ల‌కు తినిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.

 


logo