గురువారం 29 అక్టోబర్ 2020
Food - Sep 18, 2020 , 15:31:53

గ‌ర్బిణీ మ‌హిళ‌లు తిన‌కూడ‌ని ఆహార ప‌దార్థాలివే!

గ‌ర్బిణీ మ‌హిళ‌లు తిన‌కూడ‌ని ఆహార ప‌దార్థాలివే!

గ‌ర్భం దాల్చిన ప్ర‌తి మ‌హిళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలా న‌డుచుకోవాలి అన్న విష‌యాల‌ను పెద్ద‌లు, డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటారు. అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడ‌దో కూడా తెలుసుకోవాలి. ఆరోగ్య‌క‌ర‌మైన బేబి కోసం తిన‌కూడ‌ని ఆహారం లిస్ట్‌ని చ‌దివి తెల‌సుకోండి. 

తిన‌కూడ‌ని పండ్లు : 

బొప్పాయి పండు తిన‌కూడ‌దు. ఇది శిశువుకు హానిక‌రం. ఇది సైన్స్ ప‌రంగా కూడా రుజువైంది. అయితే బాగా పండిన బొప్పాయిల‌ను గ‌ర్భిణిలు తీసుకుంటే మంచిద‌ని కూడా మ‌రోవైపు చెబుతున్నారు. అలాగే ఈ స‌మ‌యంలో పైనిపిల్ పండ్లు బ్రోమెలైన్ క‌లిగి ఉన్నందు వ‌ల్ల వాటిని నివారించాలి. దీంతోపాటు చివ‌రి త్రైమాసికంలో ద్రాక్ష పండ్ల‌ను కూడా నివారించాలి. ఇది శ‌రీర వేడిని పెంచుతుంది. కాఫీ, ఇత‌క కెఫిన్ సంబంధిత  పానీయాల‌కు దూరంగా ఉండాలి. 

శుభ్ర‌ప‌ర‌చ‌ని కూర‌గాలు, పండ్లు తిన‌కూడ‌దు :   

 కూర‌గాయ‌లు, పండ్లు వేటినైనా ముందుగా శుభ్ర‌ప‌ర‌చిన త‌ర్వాతే తినాలి. ఎందుకంటే పంట మీద పురుగుల‌మందు కొడుతారు. వాటిని అలానే కోసి మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు.  

ప‌చ్చి చేప‌లు :

గర్భధారణ సమయంలో ముడి ఆహారం అంటే వండ‌ని చేప అస‌లు తిన‌కూడ‌దు. షెల్ఫిష్, మార్లిన్, కత్తి ఫిష్, షార్క్, సుషీ ఇవన్నీ మిథైల్ మెర్క్యూరీని కలిగి ఉంటాయి. ఇవి పిండం అభివృద్దిని నివారిస్తుంది. పోనీ చేప నూనెల‌ను వాడేమందు వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. 

ప‌చ్చి మాంసం :

స‌రిగా ఉడికించ‌న మాంసాల‌ను జీవితంలో ఎప్పుడూ తిన‌కూడ‌దు. ముఖ్యంగా గ‌ర్భిణీ మ‌హిళ‌లు అస‌లు తిన‌కూడ‌దు. ఇది బ్యాక్టీరియాను క‌లిగి ఉంటుంది. వీటిలో టాక్సోప్లాస్మా తిత్తులు కూడా ఉండవచ్చు. ఇది పిండానికి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తాయి.  

ఆల్కహాల్ : 

గర్భవతిగా ఉన్నప్పుడు ఆల్క‌హాల్‌ను ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌కూడ‌దు. ఇది పుట్టబోయే బిడ్డకు విషం లాంటిది. ఒక‌వేళ‌ ఆల్కహాల్ తీసుకుంటే అది శిశువు ర‌క్తంలో క‌లుస్తుంది. దీంతో బేబి ఆనారోగ్యానికి గురై ప్ర‌ణానికే ప్ర‌మాదం.  

ఫాస్ట్‌ఫుడ్ :

ఈ తొమ్మిది నెలలు ఫాస్ట్‌పుడ్‌ను నివారించండి. రెస్టారెంట్‌లో ఎంత శుభ్రంగా చేస్తారో తెలియ‌దు. అది శిశువు ఆరోగ్యానికి ప్ర‌మాదం. 

ప‌చ్చి గుడ్లు :

గ‌ర్భిణీ మ‌హిళ‌లు ప‌చ్చిగుడ్లు అస‌లు తిన‌కూడ‌దు. ఇది పిండం పెరుగుద‌ల‌పై ప్రభావం చూపుతుంది. గుడ్డులోని తెలుపు, ప‌చ్చ‌సొన రెండింటినీ స‌రిగ్గా ఉడికించాలి. అలాగే గుడ్డుతో త‌యారు చేసే స‌లాడ్ డ్రెస్సింగ్, సాస్‌ల‌ను నివారించాలి. పాశ్చ‌రైజ్డ్ గుడ్లు ఉన్నందున వాటికి బ‌దులుగా స్టోర్ చేసిన వాటిని వాడాలి. 

పాల ఉత్పత్తులు :

పాశ్చరైజ్ చేయని పాలు, జున్ను పిండానికి హాని కలిగిస్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లే‌దు.  

సాఫ్ట్ చీజ్ :

సాఫ్ట్ జున్ను పాశ్చ‌రైజ్ చేయ‌ని పాల‌తో త‌యారు చేస్తారు. బ్యాక్టీరియా ఉండొచ్చు. ఫెటా చీజ్, గోర్గోంజోలా, అన్ని ఇతర మెక్సికన్ స్టైల్ చీజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి కాస్త దూరంగా ఉండాలి. వీటితోపాటు ఐస్‌క్రీమ్‌ల‌కు దూరంగా ఉండాలి.

డ‌బ్బా ఆహారం :

ముందుగా ప్రిపేర్ చేసి డ‌బ్బాలో స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఇది హానిక‌ర‌మైన బ్యాక్టీరియాను క‌లిగి ఉండ‌వ‌చ్చు. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో వీటికి దూరంగా ఉండ‌డ‌మే మంచిది. 

ధూమ‌పానం :

సిగ‌రెట్ బిడ్డ‌కు హానిక‌రం. పొగాకులో ఉన్న నికోటిన్ పిండం పెరుగుద‌ల‌ను త‌గ్గిస్తుంది. ధూమ‌పానం చేయ‌డ‌మే కాదు చేసి వారికి కూడా దూరంగా ఉండాలి.


logo