బుధవారం 27 జనవరి 2021
Food - Sep 19, 2020 , 15:31:55

కొత్తిమీర తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా?

కొత్తిమీర తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా?

క‌ర్రీలో కొత్తిమీర వ‌స్తే చాలు, క‌రివేపాకును తీసిప‌డేసిన‌ట్లు ప‌డేస్తారు. కొత్తిమీర‌ను ప‌డేస్తే ఆరోగ్యాన్ని వ‌దులుకున్న‌ట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రుచిని ఇవ్వ‌డ‌మే కాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. మ‌రి కొత్తిమీర ఆరోగ్యానికి ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసుకుందాం. 

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు 

కొత్తిమీర‌లో యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించడానికి మిరిస్టిసిన్ సహాయపడవచ్చు. ఇన్సులిన్ నిరోధకత, మంటను కూడా తగ్గిస్తుంది. 

కిడ్నీ 

 శరీరం నుంచి విషాన్ని, సూక్ష్మక్రిములను తొలగించడానికి కొత్తిమీర‌ సహాయపడుతుంది. ఎలుక‌ల‌కు కొత్తిమీర ర‌సాన్ని తాగిస్తే నీరు తాగిన దానిక‌న్న ఎక్కువ‌సార్లు మూత్ర విస‌ర్జ‌న చేసుకున్నాయ‌ని నిర్థార‌ణ అయింది.   

క్యాన్సర్ 

కొత్తిమీర‌లో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. అంతేకాదు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో కార్నోసోల్ కూడా ఉంది. ఇది రొమ్ము, చ‌ర్మం, పెద్ద‌పేగు, ప్రోస్టేట్, క్యాన్స‌ర్ వంటి పెద్ద రోగాల‌కు చికిత్స చేయ‌డంలో మంచి ఫ‌లితాన్నిస్తుంది.  

గుండె 

రక్తపోటు చికిత్సకు వాడే ఔష‌ధంలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తారు.  ఇందులోని రిచ్ ఫ్లేవనాయిడ్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎముకలు  

కొత్తిమీర‌లో విట‌మిన్ కె పుష్క‌లంగా దొరుకుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డానికి కొత్తిమీర సాయ‌ప‌డుతుంది.

జీర్ణక్రియ 

జీర్ణ‌క్రియ రుగ్మ‌త‌ల‌కు  చికిత్స చేయడానికి కొత్తిమీర సహాయపడుతుంది. ఇందులో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌కు తోడ్ప‌డుతుంది.  

ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ 

కొత్తిమీర‌లో అనేక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. ఇవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అంతేకాదు ఇందులో విట‌మిన్ సి కూడా ఉంది.  

కాలేయం 

కొత్తిమీర  కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కాలేయ కణాల పునరుత్పత్తికి కొత్తిమీర సహాయపడుతుంది.    

కళ్లు

కొత్తిమీర‌లో విటమిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో కంటిని రక్షించడానికి సహాయపడే లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటిన్లు కూడా ఉన్నాయి.


logo