హైదరాబాద్, మే 29: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల తోపాటు కాలుష్యం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాము. అటువంటి వాటిలో తెల్లజుట్టు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరినీ తెల్లజుట్టు సమస్య వేధిస్తుంటుంది. యువత కూడా దీని బారిన పడి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ఇప్పుడు మనం కొన్ని సహజసిద్ధమైన పద్దతులను ఉపయోగించి తెల్లజుట్టు సమస్యను పరిష్కరించుకోవచ్చు.. అదెలాగంటే…!
ఉసిరికాయ జుట్టుకు ఎంతో మంచిది. ఉసిరికాయ పొడిలో మెంతి పొడి వేసి ఈ రెండింటిని కలిపి నీళ్లు వేసి పేస్ట్ లాగ చేసుకోవాలి. రాత్రిపూట పడుకునే సమయంలో ఈ పేస్ట్ ను మాస్క్ లాగా వేసుకుని ఉదయం వరకు అలాగే వదిలేసి ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు జుట్టుకు పట్టడమేకాకుండా మీ జుట్టు తెల్లగా మారకుండా కాపాడుతాయి.
అలాగే కరివేపాకు కూడా మన జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి బాగా మరిగించి తర్వాత వాడకట్టుకోవాలి. ఈ నూనెను రాత్రి సమయంలో తలకు బాగా రాసుకుని మసాజ్ చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే మీ జుట్టుకు తగిన పోషకాలు లభించి జుట్టు సమస్యలు మెల్లగా తగ్గుతాయి.