సోమవారం 06 జూలై 2020
Food - Jun 26, 2020 , 21:14:40

కూరగాయలు పండ్ల ధరలు పైపైకి..

కూరగాయలు పండ్ల ధరలు పైపైకి..

అన్ని వస్తువుల మాదిరిగా కూరగాయలు, పండ్ల ధరలు రాకెట్‌‌ వేగంతో పెరుగుతుండటం ఆందోళనకరం. సంవత్సరంలో ఈసారి కూరగాయల ధరల పెరుగుదల సాధారణం అయినప్పటికీ, ఈ సమయంలో పెంపు అసాధారణంగా ఉంది.  కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో కూరగాయల వ్యాపారులు ధరల పెంపును ఉపసంహరిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ ఎదురైంది. లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయలు, పండ్ల ధరలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి.

అయితే, కూరగాయల ధరలు గత కొన్ని రోజులుగా పెరిగాయి. పంట కోత పూర్తి కావడం, రవాణా ఖర్చులు పెరగడం కూరగాయల ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్పవచ్చు,

 బీరకాయల ధర కొద్ది రోజుల క్రితం కిలో రూ. 20 ఉన్నవి. నేడు రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ. 100కు విక్రయిస్తున్నారు. 

అన్ని రకాలు కూరగాయలు కిలో రూ. 20 ఉన్నావి ప్రస్తుతం రెట్టింపు కన్న ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో రూ. ౩౦  నుంచి రూ. 80గా, టమాట కిలో రూ. 10 నుంచి రూ. 40గా పెంచారు.

సాధరణ ప్రజలు,  ప్రైవేటు ఉద్యోగులు లాక్‌డౌన్‌ కాలంలో జీతాల కోతతో ఇబ్బందులు పడుతుంటే కూరగాయలు ధరల పెంపు  శరాఘాతంగా మారింది.

సామాన్యులు, చిరు ఉద్యోగులు కూరగాయలు ధరల పెంపుతో కిలోకూ బదులు అర, పావు కిలోతో వారి బడ్జట్‌ సరిపడా  తీసుకొంటున్నామంటున్నారు.  

 చిల్లర వ్యాపారులు మాట్లాడుతూ..  మార్కెట్‌ ట్రెండు దృష్ట్యా ధరల పంపు ఉందని మా చేతుల్లో ఏమి లేదని  టోకు వ్యాపారులుపై ఆధారపడి ఉంటుందని వారు వివరిస్తున్నారు. logo