శనివారం 16 జనవరి 2021
Food - Aug 29, 2020 , 15:17:19

ఉల్లిర‌సాన్నిఇలా తాగుతున్నారా? అయితే లాక్‌డౌన్ బొజ్జ మాయం!

ఉల్లిర‌సాన్నిఇలా తాగుతున్నారా? అయితే లాక్‌డౌన్ బొజ్జ మాయం!

ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దంటున్నారు. ఈ విష‌యాన్ని ఎన్నిసార్లు చెప్పినా త‌ప్పులేదు. ఉల్లివ‌ల్ల అన్ని ప్ర‌యోజ‌నాలున్నాయి మ‌రి. ఆరోగ్యం, అందం ఇలా ఒక‌టేమిటి ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. లాక్‌డౌన్‌లో ప్ర‌తిఒక్క‌రికీ ఉల్లితో ప‌ని ప‌డింది. లాక్‌డౌన్‌లో వ‌ర్క‌ఫ్ర‌మ్ హోమ్ చేసేవాళ్లంద‌రికీ పొట్ట రెండు, మూడు ఇంచులు అయినా ముందుకి వ‌చ్చి ఉంటుంది. కార‌ణం ఎక్కువ‌సేపు కూర్చొనే ఉండ‌డం. మ‌రి దీనిని ఉల్లితోనే ప‌రిష్క‌రించుకోవాలి. ఉల్లిని డైరెక్టుగా కాకుండా జ్యూస్‌లా చేసుకొని తాగితే బొజ్జ మాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ర‌సం వ‌ల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఒక‌సారి తెలుసుకోండి. 

* ఉల్లిగ‌డ్డ తొక్కులు తీసి మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. దీనిని వ‌డ‌గ‌ట్టుకోవాలి. ఇందులో కొంచెం తేనె క‌లుపుకొని తాగితే స‌రిపోతుంది. అంతే ఉల్లిర‌సం త‌యారైపోయిన‌ట్లే. మ‌రి వీటి ప్ర‌యోజ‌నాలు తెలుసుకుందాం. 

* ఉల్లిర‌సంలో విట‌మిన్ సి, విట‌మిన్ బి6, క్యాల్షియం, ఫైబ‌ర్‌, ఐర‌న్‌, పొటాషియం, పాస్ప‌ర‌స్‌, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.

* ఇందులో పీచుప‌దార్థం ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.

* ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిని ఉల్లిగ‌డ్డ‌లోని స‌ల్ఫ‌ర్ కాంపౌండ్లు త‌గ్గిస్తాయి.

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవాళ్ల డైట్‌లో ఉల్లిర‌సం కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివ‌ల్ల సులువుగా బ‌రువు త‌గ్గుతారు. ఇది మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ల‌ను కూడా త‌గ్గిస్తుంది. 

* క‌రోనా స‌మ‌యంలో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం నుంచి విముక్తి పొందాలంటే వెంట‌నే ఉల్లిర‌సం తాగ‌డం ఉత్త‌మం. దీనివ‌ల్ల త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* కొంత‌మంది క‌ర్రీలో వ‌చ్చే ఉల్లిముక్క‌ల‌ను తీసి ప‌డేస్తుంటారు. అలా ఎప్ప‌టికీ చేయ‌కూడ‌దు. దీనివ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అంతేకాదు ముఖం మీద మొటిమ‌లు రాకుండా చూసుకుంటుంది.

* క‌రోనా కంటే ముందు మ‌నుషుల‌ను ప‌ట్టి పీడిస్తున్న క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి కార‌కాల‌ను సైతం అడ్డుకోవ‌డ‌డానికి ఉల్లి ఉప‌యోగ‌ప‌డుతుంది.

* వీటితోపాటు ప్రొస్టేట్ గ్రంథి బాగా ప‌నిచేసేందుకు ఉల్లిర‌సం స‌హ‌క‌రిస్తుంది. బీపీతో బాధ‌ప‌డేవారికి ఉల్లిర‌సం మంచిది.