సోమవారం 18 జనవరి 2021
Food - Aug 25, 2020 , 16:29:30

చ‌క్కెర తింటే బ‌రువు పెరుగుతారా? ఇంకేం జ‌రుగుతుంది!

చ‌క్కెర తింటే బ‌రువు పెరుగుతారా? ఇంకేం జ‌రుగుతుంది!

సాధార‌ణంగా ఆరోగ్యానికి చ‌క్కెర క‌న్నా బెల్లం మంచిది. బెల్లం శ‌రీరారికి వేడి చేసినా కావాల్సిన ఐర‌న్‌ను అంద‌జేస్తుంది. మ‌రి చ‌క్కెర ఎక్కువ‌గా తీసుకునేవాళ్ల ప‌రిస్థితి ఏంటి. కాఫీ, టీ, బ్రేక్‌ఫాస్టుల‌కు చాలామంది చ‌క్కెర‌నే వాడుతుంటారు. దానివ‌ల్ల కొలెస్ట్రాల్ పెరిగి బ‌రువు పెరుగుతారు. అంతేకాదు మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌కు చ‌క్కెర కార‌ణం అవుతుంది.

రిఫైండ్ షుగ‌ర్ వాడ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డ‌మే కాకుండా యాక్నే కీకి కార‌ణ‌మ‌వుతుంది. అలాగే బ్రేకౌట్స్ కీకి  దారితీస్తుంది. చ‌క్కెర ఎక్కువ‌గా తింటే అందం కూడా పాడ‌వుతుంది. ఎందుకంటే.. ఇది స్కిన్ ఎలాస్టిసిటీని త‌గ్గేలా చేస్తుంది. అలాగే కొలాజెన్ ఫార్మ్ అవ్వ‌కుండా ఆగిపోతుంది. దీంతో చిన్న వ‌య‌సులోనే పెద్ద‌వాళ్ల‌లా క‌నిపిస్తారు. చ‌క్కెర‌తోపాటు ఐస్ క్రీం, చాక్లెట్స్‌, జామ్ వంటి వాటికి వీలైనంత వ‌ర‌కు దూరంగా ఉండాలి. దీనివ‌ల్ల చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు ప‌డుతుంది.