గురువారం 21 జనవరి 2021
Food - Jul 25, 2020 , 20:07:09

పరీక్షల సమయంలో చిన్నారులకు ఈ ఫుడ్ బెస్ట్

పరీక్షల సమయంలో చిన్నారులకు ఈ ఫుడ్ బెస్ట్

హైదరాబాద్: పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి గుర వుతుంటారు. మంచి మార్కులు రావాలంటే…మెదడు షార్ప్‌గా ఉండాలి. అందుకోసం సరైన ఫుడ్ తినాలి. చదువుతోపాటూ… క్వాలిటీ ఫుడ్ తింటే… శరీరం అలసిపోకుండా ఎనర్జీతో ఉంటుంది. కళ్లు అలసిపోకుండా ఉంటాయి. అలాగే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అందువల్ల తినే ఆహారంలో పోషకాలన్నీ ఉండేలా జాగ్రత్త పడాలి. ఫ్రై పుడ్‌కి దూరంగా ఉండాలి. దాని బదులు కూరగాయలు, ఆకు కూరలతోపాటూ… యాపిల్ వంటి, పుల్లగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. కొద్దిగా మొలకల వంటి ఆహారం తీసుకోండి. ముఖ్యంగా పొటాషియం ఉండే ఖర్జూరాల లాంటివి తింటే బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. క్యారెట్, ఆకు కూరల్లోని విటమిన్ "ఏ " కళ్లకు మేలు చేస్తుంది. అందువల్ల అలాంటి ఆహారం ఎక్కువ తీసుకోవాలి.

మెదడు బాగా పనిచెయ్యాలంటే… నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. అలాగే… గాలి బాగా తగిలే ప్రదేశంలో కూర్చోవాలి. చుట్టూ మొక్కలు, చెట్లూ ఉంటే… శరీరానికి  మంచి ఆక్సిజన్ అందుతుంది. మంచి గాలి తగిలే చోట కూర్చొని చదివితే… చదివింది బాగా మైండ్‌లోకి వెళ్తుంది. బాగా చదివేందుకు, చదివింది మైండ్‌కి ఎక్కేందుకు ఎక్కువగా  సంప్రదాయ ఆహారమే  తీసుకోండి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లొద్దు. స్వీట్ చాకొలెట్ వంటివి ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. కాబట్టి… బాగా స్ట్రెస్ ఫీలైనప్పుడు ఓ చిన్న డార్క్ చాకొలెట్ తినండి. ఆ తర్వాత పది నిమిషాలు నడవండి. తద్వారా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి.   


logo