గురువారం 13 ఆగస్టు 2020
Food - Jul 29, 2020 , 18:39:59

ఈ కాలంలో తినాల్సిన కూర‌గాయ‌లివే!

ఈ కాలంలో తినాల్సిన కూర‌గాయ‌లివే!

క‌రోనా నేప‌థ్యంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ని పెంచుకోవ‌డానికి మంచి ఆహారం తీసుకుంటున్నారు. అందులో బాగంగా సీజ‌న్‌ని బ‌ట్టి కొన్ని కూర‌గాయ‌లు తినాలి. లేదంటే సీజ‌న్‌లో వ‌చ్చే కూర‌గాయ‌ల నుంచి వ‌చ్చే పోష‌కాల‌ను మిస్ అవుతారు. వేడి వేడి ఎండ‌లు పోయి చ‌ల్ల చ‌ల్ల‌ని వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాతావ‌ర‌ణం మార‌డంతో శ‌రీరంలో చాలా మార్పులు వ‌స్తాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలంటే ఈ కూర‌గాయ‌లు త‌ప్ప‌నిస‌రిగా తినాలి. మ‌రి ఆ కూర‌గాయ‌లేంటో తెలుసుకుందాం.

కాకరకాయ : ఈ కాయ‌లు చేదుగా ఉంటాయ‌ని దీనికి సంబంధించిన కూర‌లు కూడా ఎక్కువ‌గా తిన‌రు. కానీ కాక‌ర‌కాయ వ‌ల్ల శ‌రీరానికి మేలు జ‌ర‌గుతుంది. ఇందులో విట‌మిన్ సి ఉంటుంది. కాక‌ర‌కాయ వేపుడు, కూర‌, కందిప‌ప్పు పొడి కూర‌, కాక‌ర‌కాయ పులుసు ఇలా న‌చ్చిన కూర‌లు వండుకుంటారు. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక‌సారి ట్రై చేసి చూడండి. 

పొటల్స్ : ఇవి చూడ్డానికి దొండ‌కాయ‌ల్లా ఉంటాయి. ఇవి ఎక్కువ‌గా ఈ సీజ‌న్‌లో దొరుకుతాయి. వ‌ర్షాకాలంలో జ‌లుబు, ద‌గ్గు, తల‌నొప్పితో బాధ ప‌డ‌తుంటే పొట‌ల్స్ చ‌క్క‌ని ప‌రిష్కారం. అంతేకాదు ఇవి ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ని పెంచ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతాయి. వీటిని ఫ్రై చేసుకొని క‌ర్రీలా తింటే బాగుటుంది. 

సొర‌కాయ :  శ‌రీరానికి చ‌లువ చేయాలంటే సొర‌కాయ మంచిది. మ‌రి వ‌ర్షాలు ప‌డుతున్న‌ప్పుడు ఇది తింటే మంచిదా? అనుకుంటారేమో మంచిదే. ఇందులో ఫైబ‌ర్ ఉంటుంది కాబ‌ట్టి జీర్ణ‌క్రియ‌ను పెంచుతుంది. తొంద‌ర‌గా క‌డుపు నిండుతుంది. క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బి, విటమిన్ సి ఇమ్యూన్ సిస్టంని బలోపేతం చేస్తుంది. సొర‌కాయ‌తో చేసిన హ‌ల్వా పిల్ల‌ల‌కు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. 

దుంప‌లు : వ‌ర్షాకాలంలో దుంప‌లు ఆరోగ్యానికి మంచిది. భూమి లోప‌ల పెరుగ‌తాయి కాబ‌ట్టి వీటి మీద బ్యాక్టీరియా త‌క్కువ‌గా ఉంటుంది. ఆలూ, గెనిసిగ‌డ్డల‌ను ఎంత ఇష్టంతో తింటారో తెలిసిందే.

ఆన‌ప‌కాయ :  సొర‌కాయ‌, ఆన‌ప‌కాయ రెండూ వేర్వేరు. రెండూ ఒకేలా ఉన్న‌ప్ప‌టికీ వేర్వేరు. సొర‌కాయ పొడుగ్గా ఉంటాయి. ఆన‌ప‌కాయ పొట్టిగా ఉంటుంది. ఇది  ఎసిడిటీనీ, బ్లోటింగ్ నీ, గుండెల్లో మంటని తగ్గిస్తుంది.


logo