బుధవారం 27 జనవరి 2021
Food - Aug 27, 2020 , 17:51:17

కుడుములు తినేవారికి ఎన్నో స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌!

కుడుములు తినేవారికి ఎన్నో స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌!

వినాయ‌క చ‌వితి అన‌గానే ముందుగా గుర్తొచ్చేది కుడుములే. అస‌లు ఇవి లేకుండా వినాయ‌క చ‌వితినే ఊహించుకోలేరు. ఏడాదికి ఒక‌సారి అయినా ఈ రెసిపీ టేస్ట్ చూడాల‌ట‌. ఇవి తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే పండుగ రోజు ప్ర‌తిఒక్క‌రూ రుచి చూడాల్సిందే. 10 రోజుల వేడుక‌లో రోజూ చేసుకొని తిన్నా ఆరోగ్యంగా ఉంటారు. కుడుములు వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలేంటో చూద్దాం.

బ్ల‌డ్ ప్రెజ‌ర్ : 

కుడుముల త‌యారీకి వేసే ఇంగ్రీడియంట్స్‌ గుండెను సంరక్షిస్తాయి. అలాగే బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

వెయిట్ లాస్ : బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కుడుములు స‌హాయ‌ప‌డుతాయి. ఫ్రూట్స్‌తోపాటు కొబ్బ‌రిని తీసుకుంటే శ‌రీరంలో ఉండే కొవ్వు త‌గ్గుతుంది. ఇది  ప్లాంట్ స్టెరాల్స్ హెల్ప్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా బూస్ట్ అవుతాయి.   

మ‌ధుమేహం : 

కుడుములు డయాబెటిక్ పేషంట్స్‌ని సురక్షితంగా ఉంచుతుంది. ఇందులో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

పీసిఓడీ :

మ‌హిళ‌లు కుడుములు తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందుతారు. బ‌రువుగా ఉన్న‌వారికి త‌గ్గ‌డానికి సాయ‌ప‌డుతుంది. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు ఎదుర‌య్యే అనేక స‌మ‌స్య‌ల నుంచి కుడుములు దూరం చేస్తుంది.

థైరాయిడ్ :

ఈ రోజుల్లో చాలామందిని థైరాయిడ్ ప‌ట్టి పీడిస్తున్న‌ది. దీని నుంచి విముక్తి పొంద‌డానికి ఆహారంలో కుడుముల‌ను యాడ్ చేసుకోండి. ఇది థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


logo