శనివారం 29 ఫిబ్రవరి 2020
ఇలా చేస్తే మంచిది!

ఇలా చేస్తే మంచిది!

Jan 31, 2020 , T00:02
PRINT
ఇలా చేస్తే మంచిది!

  • కేక్‌ కూల్‌ ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే టేస్ట్‌ బాగుంటుంది.
  • కేక్‌ను ఫ్రిజ్‌లో ఉంచేదానికంటే గాలి చేరని కంటైనర్‌లో ఉంచడం మంచిది.
  • బ్రెడ్‌, ఉల్లి, ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెట్టడం వల్ల వెంటనే పాడైపోతాయి.
  • ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇది ఇంట్లోని దుర్వాసనలు, క్రిమికీటకాలను దూరం చేస్తుంది.
  • పుట్టగొడుగులు వండే ముందు.. పొడి వస్త్రంతో తుడిచి ఆపై ధారలా పడుతున్న నీటితో కడుగి మరోసారి తుడిచి వండుకుంటే రుచిగా ఉంటుంది.
  • వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్‌ పాలు వేయాలి.
  • కట్‌ చేసిన ఆపిల్‌ ముక్కలను అల్లం నీటిలో వేసినట్లయితే రంగు మారకుండా ఉంటాయి.
  • ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కోసిన పండ్ల ముక్కలను వేయాలి. రెండు నిమిషాల తర్వాత తీస్తే పండ్లు బ్రౌన్‌ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.
  • పాలు విరిగిపోతాయనుకుంటే కాచేటప్పుడు అందులో కొద్దిగా వంటసోడా వేస్తే సరిపోతుంది.


logo