బుధవారం 23 సెప్టెంబర్ 2020
Food - Jul 23, 2020 , 17:07:33

ఈ ర‌క‌మైన‌ టీ తాగితే స్లిమ్‌గా త‌యార‌వుతారు!

ఈ ర‌క‌మైన‌ టీ తాగితే స్లిమ్‌గా త‌యార‌వుతారు!

వ‌య‌సు పెరిగే కొద్ది, డెలివ‌రీ అయిన త‌ర్వాత, లాక్‌డౌన్‌లో ఇంట్లో కూర్చోవ‌డం వ‌ల్ల‌ ఇలా ర‌క‌ర‌కాలుగా బ‌రువు పెరిగిపోతున్నారు. గంటల కొద్ది కంప్యూట‌ర్ ముందు కూర్చునే పురుషులు కూడా అమాంతం లావైపోతున్నారు. అయ్యో బ‌రువు పెరిగిపోతున్నాం అని బాధ ప‌డ‌డం త‌ప్ప ఏం చేసినా స్లిమ్‌గా త‌యార‌వ్వ‌ట్లేద‌ని బాధ‌ప‌డుతున్న వారే ఎక్కువ‌గా ఉన్నారు. అందుకే ఒక‌సారి జిన్సెంగ్ టీ తాగమ‌ని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రి దీనివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో చూద్దాం.

* జిన్సెంగ్ టీ తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం ఖాయం. ఇది నేచుర‌ల్ ఎపెటైట్ స‌ప్రెసెంట్‌గా ప‌నిచేస్తుంది. అంతేకాదు ఆక‌లిని కంట్రోల్ చేస్తుంది. ఈ టీ తాగినంత మాత్రాన బ‌రువు త‌గ్గుతార‌ని మాత్రం చెప్ప‌డం లేదు. ఇది తాగుతూనే రెగుల‌ర్‌గా ఎక్సైర్‌సైజ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఉండాలి.

* హై బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేయడానికి జిన్సెంగ్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ టీని హోమ్‌మేడ్ రెమెడీ అని చెప్పుకోవ‌చ్చు. ఈ టీ ప‌నిత‌నం కొన్ని క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో నిర్దార‌ణ అయింది. 

* శరీరంలోని హార్మోన్ల బ్యాలన్స్ కు ఈ టీ హెల్ప్ చేస్తుంది. దీంతో  బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యల నుంచి మహిళలకు రక్షణ లభిస్తుంది.

* జిన్సెంగ్ టీ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరిగింది. దీంతోపాటు అటెన్ష‌న్ స్పాన్ కూడా మెరుగుప‌డుతుందంటున్నారు. ఆందోళన, స్ట్రెస్ ను ఎదుర్కోవడానికి అలాగే ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ హెర్బల్ టీ మంచిది.

* ఈ టీలో  యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. దీనివ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ రేటును స్లో చేసి హార్ట్‌కు ఆక్సిజ‌న్ డిమాండ్‌ను త‌గ్గించేందుకు ఈ టీ ప‌నిచేస్తుంది. 

* టీ తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ఫ్లూ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను మెరుగుప‌రిచేందుకు జిన్సెంగ్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు. హానిక‌ర‌మైన బ్యాక్టీరియా, వైర‌స్‌తో పోరాడే క్వాలిటీస్‌ను శ‌రీరంలో డెవ‌ల‌ప్ చేసేందుకు ఈ హెర‌బ‌ల్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది. 


logo