బుధవారం 05 ఆగస్టు 2020
Food - Aug 01, 2020 , 13:35:23

ఈ ఒక్క పండు తింటే చాలు.. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది!

ఈ ఒక్క పండు తింటే చాలు.. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, బెల్లం, దాల్చిన చెక్క‌, ప‌సుపు వంటి ఇంగ్రీడియంట్స్‌తో కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటున్నారు. వీట‌న్నిటిక‌న్నా హ‌నీడ్యూ మెల‌న్ పండుని తింటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని గ్రీన్ మెల‌న్ అని కూడా అంటారు. ఇది తిన‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు.

* ప‌చ్చ రంగులో ఉంటుంది కాబ‌ట్టి దీన్ని గ్రీన్ మెల‌న్ అని అంటారు. ఇది ర‌క‌ర‌కాల సైజులో ఉంటుంది. ఒక క‌ప్పు గ్రీన్ మెల‌న్‌లో 64 కేల‌రీలు ఉంటాయి. ఇందులో 1.4 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. 

* గ్రీన్ మెల‌న్‌లో యాంటీ ఆక్సిడెంట్ విట‌మిన్ సి స‌మృద్దిగా ల‌భిస్తుంది. అలాగే ఎలెక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. శ‌రీరంలో ఫ్లూయిడ్ బాల‌న్స్‌ను మెయింటెయిన్ చేయ‌డానికి గ్రీన్ మెల‌న్ సాయ‌పడుతుంది. ఇందులో కేల‌రీలు త‌క్కువ‌గా ఉండి, పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి.

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి గ్రీన్ మెల‌న్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే దీన్ని వెయిట్ వాచ‌ర్స్ ఫ్రెండ్లీ ఫుడ్ అని అంటారు. వాట‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండి, సోడియం కూడా త‌క్కువ‌గా ఉంటుంది.  అందుకే ఈ పండుని తిన్న‌ప్పుడు ఆక‌లి తీరిన ఫీలింగ్ క‌లిగి త‌క్కువ ఆహారం తీసుకుంటారు. 

* ఈ పండు బ్రెయిన్ ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు తోడ్ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ సి జ‌లుబును దూరం చేయ‌డంతో పాటు న్యుమోనియా వంటి రెస్పిరేటరీ రిస్క్స్ త‌గ్గుముఖం ప‌ట్టేలా చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

* శీతాకాలంలో ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు గ్రీన్ మెల‌న్ పండుని జ్యూస్‌లా చేసుకొని తాగితే శ‌రీరాన్ని చ‌ల్లగా చేస్తుంది.  

* ఈ పండు హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. ఈ వ్యాధితో బాధ‌ప‌డేవారు సోడియం త‌క్కువ‌గా ఉండే పండ్లు తింటారు. అందుకే వారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.  

* క‌డుపులో ఉండే శిశువు ఆరోగ్యంగా ఎద‌గాలంటే పోష‌కాలున్న గ్రీన్ మెల‌న్ తిన‌డం ఉత్త‌మం. గ‌ర్భిణీ మ‌హిళ‌లు ఫేస్ చేసే ప్రాబ్ల‌మ్స్‌ను ఈ పండు నియంత్రిస్తుంది. 

* గ్రీన్ మెల‌న్ తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి  మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫోలేట్ అనే ముఖ్యమైన మాక్రో న్యూట్రియెంట్ కూడా బోన్ హెల్త్ కు సపోర్ట్ చేస్తుంది.






logo