శనివారం 30 మే 2020
Food - Mar 19, 2020 , 19:07:15

వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌తో బోలెడు లాభాలు..!

వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌తో బోలెడు లాభాలు..!

మార్చి నెల అయిపోవస్తున్నది. మెలమెల్లగా ఎండలు ముదురుతున్నాయి.  వేసవిలో తీసుకోవలిసిన జాగ్రత్తలలో చల్లని పానీయాలు ఒకటి. ఎండ తాపాన్ని తగ్గించే పానీయాల్లో పలుచని మజ్జిగది కీలక పాత్ర. ఇతర కూల్‌ డ్రింక్స్‌ కంటే సహజ ఆహారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు.   వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే అనేక పానీయాల్లో మ‌జ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.  వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!  

1. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి.
2. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
3. కాల్షియం లోపం ఉన్న‌వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి.
4. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.


logo