బుధవారం 20 జనవరి 2021
Food - Dec 04, 2020 , 21:24:18

జొన్న రొట్టెలు తింటే మంచిదని ఎందుకంటారు..?

జొన్న రొట్టెలు తింటే మంచిదని ఎందుకంటారు..?

హైదరాబాద్‌ : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక..  ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దృష్టి జొన్న రొట్టెలపై పడింది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు ప్రతి రోజూ జొన్న రొట్టెలు తింటున్నారు. కేవలం డయాబెటీస్ పేషెంట్లు మాత్రమే కాదు .. చాలా మంది యువతీ యువకులు కూడా వీటిని తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఆహారం మానేసి వీటితోనే కడుపు నింపుకుంటున్నారు. 

1. జొన్న రొట్టెలు ఎందుకు తినాలి..

జొన్న రొట్టెలకు ఇంత డిమాండ్ పెరగడానికి కారణమేంటి..  ఇవి ఎందుకు తినాలి. తింటే ఏం లాభం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. వాటిలో జొన్నలు చాలా ముఖ్యమైనవి. వీటిలో కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు, పీచు లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో అధికంగా లభిస్తాయి.

2. జొన్న రొట్టెలు తింటే ఏమవుతుంది..

1.  శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది.

 2. జొన్నల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి.

 3. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది.

 4. జొన్నలు ఫ్రీ రాడికల్స్ తో  పోరాడి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.

5. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది.

6. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

 7. జొన్నల్లో ఉండే పీచు పదార్థం గుండె సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

8. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి.

9. శరీరానికి కావాల్సిన దాంట్లో దాదాపు 52శాతం ఫైబర్ జొన్నరొట్టెల ద్వారా అందుతుంది. ఇది జీర్ణశక్తిని పెంపొంది గ్యాస్, బ్లోటింగ్, డయేరియా వంటి సమస్యలను దూరం చేస్తాయి.

10. జొన్నల్లో ఉండే పోషకాలు పాలిచ్చే తల్లులకు చాలా మంచివి.

logo