శాఖాహారులకు గుడ్‌న్యూస్.. వీరికి ఈ ముప్పు రానే రాదట!

నాన్‌వెజ్ బాగా తినేవారికే సరైన పోషకాలు అందడం లేదు. ఇక శాఖాహారులు బతికి బయట పడడం చాలా కష్టం అని అందరూ అంటుంటారు. కానీ నాన్‌వెజ్ తినే వారి కన్నా వెజ్ ప్రియులే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వీరు తృణధాన్యాలు, ఆకు కూరలు, అన్ని రకాల కూరగాయలు తినేందుకు మొగ్గు చూపుతారు. కానీ, నాన్‌వెజ్ ప్రియులు మాత్రం ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లు చేస్తుంటారు. దీంతో శరీరంలో ఫ్యాట్ ఎక్కువై అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. శాఖాహారులకు పోషక పదార్థాలు అందవు అని బాధపడేవారికి ఈ పరిశోధన ఊరట కలిగించింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు ఓ విషయాన్ని వెల్లడించారు. శాకాహారులకు హృద్రోగాలు వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. మాంసాహారం తినకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తినేవారికి ఈ ముప్పు తగ్గుతుందని చెప్పారు. డెయిరీ ఉత్పత్తులు, సోయాబీన్, మాంసం వంటి వాటిలో అమైనో యాసిడ్ల మోతాదు అధికంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. తృణదాన్యాల్లో సల్ఫర్ అమైనో యాసిడ్ మోతాదు తక్కువగా ఉంటుంది. కాబట్టి వెజ్ ప్రియులు మరేం చింతించకుండా తినే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ తినండి.