మంగళవారం 19 జనవరి 2021
Food - Sep 02, 2020 , 13:56:20

ఈ విష‌యాలు తెలిస్తే 'క‌రివేపాకు' క‌నిపించిన‌ప్పుడ‌ల్లా తినాల‌నుకుంటారు!

ఈ విష‌యాలు తెలిస్తే 'క‌రివేపాకు' క‌నిపించిన‌ప్పుడ‌ల్లా తినాల‌నుకుంటారు!

క‌రివేపాకు అంటే అంద‌రికీ చుల‌క‌నే. తినే ఆహారంలో ఎక్క‌డ క‌నిపించినా తీసి ప‌క్క‌న పెడుతారు. ఇలా చేసేవాళ్ల‌కి క‌రివేపాకు ప్రాముఖ్య‌త తెలిసుండ‌దు. తెలిసిన వాళ్లెవ‌రూ అలా చేయ‌రు. వంట‌ల్లో వేసుకునే క‌రివేపాకే కాకుండా చెట్టు మీద ఉన్న ఆకులు కోసుకొని తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ర‌క‌ర‌కాల వంట‌ల‌కు ఉప‌యోగించే క‌రివేపాకు వ‌ల్ల క‌లిగే లాభాలు తెలుసుకోవ‌డం ముఖ్యం. అప్పుడే దాని విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌రు. 

* ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో క‌రివేపాకు చెట్టు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఇది ఏ నేల‌మీద అయినా, ఏ సీజ‌న్‌లో అయినా బాగా దొరుకుతుంది. క‌రివేపాకును తిన‌డం వ‌ల్ల తిన్న ఆహారం సులువుగా జీర్ణ‌మ‌వ‌డ‌మే కాకుండా ఫుడ్‌పాయిజ‌న్ కాకుండా చూసుకుంటుంది.

* క‌రివేపాకులో ఫాస్ప‌ర‌స్‌, క్యాల్షియం, ఇనుము, ఫైబ‌ర్‌, మెగ్నీషియం, రాగి వంటి పోష‌కాలు ఇందులో పుష్క‌లంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్‌, ప్లాస్టీ స్టెరాల్స్‌, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ స‌మృద్దిగా దొరుకుతాయి.

* విరేచ‌నాల‌తో బ‌ల‌హీనంగా త‌యార‌య్యారా? అప్పుడు గుప్పెడు క‌రివేపాకును తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని కూడా నివారిస్తుంది.

* ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారికి క‌రివేపాకు ప‌రిష్కారం చూపుతుంది. అలాగే మ‌ధుమేహం, ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌ల‌ను అరిక‌డుతుంది.

* బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి క‌రివేపాకు మంచి ఇంగ్రీడియంట్‌. ఇది సులువుగా బ‌రువు త‌గ్గించి గుండెను ప‌దికాలాల పాటు ప‌దిలంగా ఉండేలా చూస్తుంది.

*  శ‌రీరంలో ఉండే బ్యాక్టీరియాను చంపేసి, ఎలాంటి బ్యాక్టీరియాను ద‌రిచేర‌కుండా చేస్తుంది. అంతేకాదు క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారి కార‌కాల‌ను కూడా క‌రివేపాకు నియంత్రిస్తుంది. క‌రివేపాకు ఎక్కువ‌గా తినేవారికి క్యాన్స‌ర్ ముప్పు ఉండ‌దు.

* క‌రివేపాకు డ‌యేరియాను త‌గ్గిస్తుంది.  రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డానికి కూడా క‌రివేపాకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌రివేపాకు పొడిని అన్నంలో క‌లుపుకొని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో ఐర‌న్ శాతం పెరుగుతుంది. 

* క‌రివేపాకు తినేవారి శ‌రీరం నుంచి ఎలాంటి దుర్వాస‌న రాదు. మ‌రి ఇంకేం ఎలాంటి ప‌ర్ఫ్యూమ్‌లు కొనాల్సిన అవ‌స‌రం లేదు.

* క‌రివేపాకు తిన‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా పెరుగుతుంది. 

* ఇంత ప్రాముఖ్య‌త ఉన్న క‌రివేపాకు ఇప్పుడు కూడా తీసి పారేస్తే మిమ్మ‌ల్ని ఆ దేవుడు కూడా కాపాడ‌లేరు.