గురువారం 25 ఫిబ్రవరి 2021
Food - Feb 23, 2021 , 14:23:51

వైరల్‌ వీడియో : రజనీ స్టైల్‌ దోశకు నెటిజన్లు ఫిదా!

వైరల్‌ వీడియో : రజనీ స్టైల్‌ దోశకు నెటిజన్లు ఫిదా!

ముంబై : దేశీ స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతలు తమదైన రుచులు, స్టైల్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ముంబైలో ఇటీవల ఫ్లైయింగ్‌ దోశ వైరల్‌ వీడియో అనంతరం ఇప్పుడు రజనీ స్టైల్‌ దోశతో మరో పుడ్‌ స్టాల్‌ యజమాని నెటిజన్ల దృష్టిలో పడ్డారు. మసాలా దోశ, మైసూర్‌ మసాలా దోశకు పేరొందిన ముంబైలోని దాదర్‌ ప్రాంతంలో ప్రముఖ ఫుడ్‌ స్టాల్‌ ముత్తు దోశ కార్నర్‌ రెప్పపాటులో దోశను తయారుచేయడం, కట్‌ చేయడం, కస్టమర్‌ ప్లేట్‌లోకి వేయడం సోషల్‌ మీడియాలో ఫుడ్‌ లవర్స్‌ను అలరిస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. స్ట్రీట్‌ఫుడ్‌ రెసిపీస్‌ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో ఈ వైరల్‌ వీడియో పోస్ట్‌ అయింది. సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమాని అయిన ఫుడ్‌స్టాల్‌ యజమాని ముత్తు రజనీ స్టైల్‌లో దోశ మేకింగ్‌ను చేపడుతూ తనదైన సర్వింగ్‌ టెక్నిక్‌తో రూపొందిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ ఫేస్‌బుక్‌ వీడియోకు ఇప్పటివరకూ పదిహేను లక్షల లైక్స్‌, 32 వేల కామెంట్స్‌ వచ్చాయి.


VIDEOS

logo