ఆదివారం 05 జూలై 2020
Food - Jun 22, 2020 , 14:07:45

ఆల్బుక‌రా పండ్లుతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ఆల్బుక‌రా పండ్లుతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా ఉంచేందుకు అల్బుక‌రా పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. దీని ప్ర‌యోజ‌నాలు తెలిస్తే అస‌లు వ‌దిలిపెట్ట‌రు..

* ఆల్బుక‌రా పండ్ల‌ను రోజుకు ప‌ది చొప్పున తీసుకుంటే ఎలా స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు.

* ఆల్బుక‌రా పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. 

* త‌ర‌చూ ఆల్బుక‌రా పండ్లు తిన‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* ఇందులో ఉండే విట‌మిన్లు క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా చేస్తాయి.

* జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవాళ్లు ఆల్బుక‌రా పండ్లు తింటే జీర్ణ‌శ‌క్తి మెరుగ‌వుతుంది.

* ఆల్బుక‌రాలో ఉండే విటమిన్ కె ఎముక‌లను దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు అల్జీమ‌ర్స్‌ను న‌యం చేయ‌డానికి ఆల్బుక‌రా పండ్లు ఎంతో తోడ్ప‌డుతాయి. 

* ఇందులో విట‌మిన్ ఎ కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఇది కంటిచూపును మెరుగుప‌రుస్తుంది.

* ప్ర‌తిరోజూ ఈ పండ్లు సేవించ‌డం వ‌ల్ల మోనోపాజ్ ద‌శ దాటిన మ‌హిళ‌ల్లో క‌నిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారిస్తాయి.

* ఈ పండ్లు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డ‌మే కాదు చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది.

* ఇవి క్యాన్స‌ర్ క‌ణాల‌తో పోరాడ‌డ‌మే కాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది.



logo