బుధవారం 20 జనవరి 2021
Food - Aug 14, 2020 , 19:41:34

మీకు తెలుసా..? అన్నం తిన్నా కూడా ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది!

మీకు తెలుసా..? అన్నం తిన్నా కూడా ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది!

అన్నం తింటే బ‌రువు పెరుగుతార‌ని చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు. వీరికి తెలియ‌నిద‌ల్లా ఒక‌టే.. అన్నం తింటే బ‌రువు పెరుగుతార‌న్న‌ది వ‌ట్టి అపోహ మాత్ర‌మే. లిమిట్‌గా తింటే ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. అది అన్నం అయినా ఇంకేదైనా. అంతేకాదు అన్నం తిన‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ కూడా పెరు‌గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రైస్ తిన‌డం వ‌ల్ల వెంట‌నే ఎన‌ర్జీ అందుతుంది. ఇది ప‌నిచేసిన‌ట్లుగా మ‌రే ఇత‌ర ఆహారం ప‌నిచేయ‌దు.

అన్నంలో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ పుష్కలంగా ఉంటాయి. శ‌రీర కండ‌రాలు క‌రిగేలా ప‌నిచేసేవారికి అన్నం ఎంత తిన్నా ఏం కాదు. జీర్ణ‌మైపోతుంది. కార్యాల‌యాల్లో కంప్యూట‌ర్ ముందు కూర్చొని ప‌నిచేసేవారు మాత్రం కొంచెం కొంచెంగా తిన‌డం మంచిది. అంతేకాదు రోజూ అన్నం తినేవారికి అల్జైమర్స్ రిస్క్ కూడా త‌క్కువ‌గా ఉంటుంది. ఇందులోని ఫైబ‌ర్ క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చూస్తుంది. అలాగే అన్నం ఉడికేట‌ప్పుడు వ‌చ్చే నీటిని తాగితే అల్స‌ర్స్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఉద‌యం, సాయ‌త్రం అన్నం తిన్నాతిన‌క‌పోయినా మ‌ధ్యాహ్నం మాత్రం రైస్ తినేలా చూసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న సుగుణాల‌న్నీ శ‌రీరానికి అందుతాయి. 


logo