సోమవారం 03 ఆగస్టు 2020
Food - Jul 09, 2020 , 16:15:05

మాస్క్‌ ఆకృతిలో పరోటా... కరోనాపై పోరాటం

మాస్క్‌ ఆకృతిలో పరోటా... కరోనాపై పోరాటం

కరోనా మహమ్మారి పై యుద్ధంలో మాస్కే ఆయుధం.. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మధురై టెంపుల్‌ సిటీలో ఓ రెస్టారెంట్‌ వారు వినూత్నంగా మాస్క్‌ ఆకృతిలో వేడి వేడి పరోటాను అందిస్తూ తమ వినియోగదారులకు కరోనా వైరస్‌పై అవగాహన పెంచుతున్నారు. మధురై వాసులు మాస్క్‌ ధరించడంలో శ్రద్ధ చూపించడం లేదు. మేము మాస్క్‌ ఆకృతితో పరోటాను అందిస్తూ కరోనా నేపథ్యంలో మాస్క్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నమని హోటల్ ‌మేనేజర్‌ పూవలింగం చెబుతున్నారు. 

హోటల్‌లోని నైపుణ్యంగల వంటవారు తమ కళాత్మకతతో పరోటాను మాస్క్‌ ఆకృతితో రూపొందించి వాటిని చెవులకు ధరించే విధంగా తయారుచేశారు. అంతేకకుండా  ఏప్రిల్‌ నెలలో కోలకతా లోని ఓ స్వీట్‌ షాపులో స్వీట్‌కు ‘కరోనా సందేశ్‌’ అని నామకరణం చేశారు. మమతా ప్రభుత్వం రోజు  నాలుగు గంటల పాటు ఆ  షాపు తెరుచుటకు అనుమతి ఇచ్చారు. 


logo