బుధవారం 27 జనవరి 2021
Food - Sep 08, 2020 , 19:44:27

ప‌సిపిల్ల‌ల‌కు ఈ పప్పుని త‌ప్ప‌నిస‌రిగా తినిపించాలి! ఎందుకంటే..

ప‌సిపిల్ల‌ల‌కు ఈ పప్పుని త‌ప్ప‌నిస‌రిగా తినిపించాలి! ఎందుకంటే..

పుట్టిన ప‌సిపిల్ల‌ల‌కు ఆరు మాసాల‌పాటు త‌ల్లిపాలు ఇవ్వ‌డం శ్రేయ‌ష్క‌రం. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా సుర‌క్షితంగా ఉంటుంది. ఆ త‌ర్వాత కొంచెం కొంచెంగా ఆహారం అల‌వాటు చేయాలి. అందులో త‌ప్ప‌నిస‌రిగా ప‌ప్పుచారు ఆహారాన్ని తినిపించాలి. ఇది పిల్ల‌ల‌కు చాలా తేలిక‌గా జీర్ణం అవుతుంది. అంతేకాదు గ‌ట్టిశ‌క్తిని అందిస్తుంది. మ‌రి ఆ ప‌ప్పుచారు ఎలా త‌యారు చేయాలో తెలుసుకోండి.

ప‌ప్పుచారుకు కావాల్సిన ప‌దార్థాలు :

కందిప‌ప్పు : 2 స్పూన్లు

చింతపండు :  కొంచెం

ప‌సుపు :  పావు టీస్పూన్‌

జీల‌క‌ర్ర :  పావు టీస్పూన్‌

ఆవాలు :  పావు టీస్పూన్‌

నెయ్యి : అర టీస్పూన్‌

క‌రివేపాకు : ఒక రెమ్మ‌

కొత్తిమీర :  కొంచెం

ఉప్పు : త‌గినంత‌ 

త‌యారీ :

ముందుగా కందిప‌ప్పును వేయించాలి. వీటిని కుక్క‌ర్‌లో వేసి ఉడ‌క‌డానికి స‌రిప‌డా నీరు పోయాలి. అందులోనే ప‌సుపు, కొంచెం చింత‌పండు వేసి మూత‌పెట్టాలి. 4 విజిల్స్  వ‌చ్చేంత వ‌ర‌కు ఉడికించాలి. త‌ర్వాత స్ట‌వ్ మీద నుంచి దించేయాలి. ప్రెజ‌ర్ అంతా పోయిన త‌ర్వాత మూత తీసి ప‌ప్పుగుత్తితో మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోవు వేయాలి. క‌డాయిలో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. త‌ర్వాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. వేగిన త‌ర్వాత ప‌ప్పు మిశ్ర‌మాన్ని పోపులో వేయాలి. ప‌ప్పు కొంచెం గ‌ట్టిగా ఉంద‌నుకుంటే కొంచెం నీరు పోసుకోవ‌చ్చు. 5 నిమిషాల పాటు ప‌ప్పుని ఉడికించి త‌ర్వాత దించేయాలి. చివ‌రిగా ఉప్పు స‌రిపోయిందో లేదో స‌రిచూసి కొత్తిమీర‌తో గార్నిష్ చేసుకోవాలి. దీంతోపాటు సెప‌రేట్‌గా అన్నం మెత్త‌గా వండుకొని వేడి వేడి అన్నంలో ప‌ప్పుచారు వేసి బాగా క‌లిపి పిల్ల‌ల‌కు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.ఇది చేసుకోవ‌డం చాలా సులువు.


logo