బుధవారం 08 జూలై 2020
Food - Apr 13, 2020 , 14:29:03

లాక్‌డౌన్ వేళ.. ఇంట్లోనే పానీ పూరీ చేసుకోండిలా..

లాక్‌డౌన్ వేళ.. ఇంట్లోనే పానీ పూరీ చేసుకోండిలా..

పానీపూరి, గోల్గ‌ప్పా, పుచ్కా ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. అంతేకాదు పానీపూరి అంటే ప‌డిచ‌స్తారు యూత్‌. పెద్ద‌లు కూడా దీన్ని తినేందుకు సై అంటారు. అంత‌లా ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందింది. పేర్ల‌కు త‌గిన‌ట్లుగా ఒక్కో ఫ్లేవ‌ర్‌లో దీని త‌యారీ ఉంటుంది. ఇందులో రెండు ర‌కాల స్ట‌ఫ్ పెడితే గాని ఆ రుచి రాదు. ఇంకా పూరీతో పానీ ఎలా త‌యారు చేయాలి వివ‌రంగా ఉంది. అంతేకాదు పూరీ ఏదైనా పొర‌పాటు జ‌రిగినా పూరీ పొంగ‌దు సుమా!

కావలసినవి:

 • పూరి కోసం:

 • బొంబాయి రవ్వ : 250 gms 
 • వంట సోడా :  చిటికెడు 
 • మైదా  :  పావుక‌ప్పు 
 • నూనె : స‌రిప‌డా
 • ఉప్పు- రుచి సరిపడా 


 • బటానీ స్టఫ్ఫింగ్ కోసం :

 • తెల్ల బ‌టానీ :  2 క‌ప్పులు
 • నూనె :  పావుక‌ప్పు
 • ఉల్లిగ‌డ్డ త‌రుగు : ఒక క‌ప్పు
 • ట‌మాటా త‌రుగు : ఒక క‌ప్పు
 • కారం : ఒక టేబుల్‌స్పూన్‌
 • జీలకర్ర :  టీస్పూన్‌
 • అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్‌
 • ధనియాల పొడి : ఒక టేబుల్‌స్పూన్‌
 • బిరియాని ఆకు : ఒక‌టి
 • వేయించిన జీలకర్ర పొడి : ఒక టేబుల్‌స్పూన్‌
 • పసుపు : అర టీస్పూన్‌
 • చాట్ మసాలా : ఒక టీస్పూన్‌
 • ఉప్పు : స‌రిప‌డా


 • స్టఫ్ఫింగ్ కోసం

 • ఉడికించిన ఆలు : 250 గ్రా.
 • ధనియాల పొడి : ఒక టీస్పూన్‌
 • వేయించిన జీలకర్ర పొడి : ఒక టీస్పూన్‌
 • కారం : ఒక టీస్పూన్‌
 • చాట్ మసాలా : ఒక టీస్పూన్‌
 • ఉప్పు : అర టీస్పూన్‌


 • పానీ కోసం

 •  కొత్తిమీర తరుగు :  చిన్నక‌ట్ట‌
 • పుదినా తరుగు :  చిన్నక‌ట్ట‌
 • అల్లం :  చిన్న ముక్క‌
 • నిమ్మకాయ :  ఒక‌టి
 • చింతపండు : ఉసిరికాయ సైజు
 • కారం : ఒక టీస్పూన్‌ 
 • వేయించిన జీలకర్ర పొడి : ఒక టీస్పూన్‌
 • చాట్ మసాలా : ఒక టీస్పూన్‌
 • ఆంచూర్ పొడి : ఒక టీస్పూన్‌
 • నీరు : ఒక‌టిన్న‌ర లీట‌రు
 • ఉప్పు : ఒక టేబుల్‌స్పూన్‌

పూరీ త‌యారీ విధానం :

 • 1. బొంబాయి రవ్వ లో మైదా, ఉప్పు, సోడా వేసి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మెత్తగా వ‌చ్చేవ‌ర‌కు క‌లుపాలి. త‌ర్వాత‌ తడిబ‌ట్ట‌ కప్పి 30 నిమిషాలు నానబెట్టాలి.
 • 2. 30 నిమిషాలు నానిన తరువాత పల్చగా వత్తుకోవాలి, మరీ పల్చగా వత్తితే పాప‌డ‌గా త‌యార‌వుతాయి. మందంగా వత్తితే పొంగవు, మెత్తగా వస్తాయి. అందుకే మరీ మందంగా, పల్చగా కాకుండా ఉండాలి. 
 • 3. పల్చగా వత్తుకున్న‌ ఈ పిండి ని ఏదైనా బిస్కెట్ కటర్ తో గాని అంచులు పదునుగా ఉండే కప్ తో కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిని మళ్ళీ వత్తుకోండి
 • 4. వత్తుకున్న పూరీలని తడిబ‌ట్ట‌ కప్పి ఉంచాలి, లేదంటే తడి ఆరిపోయి పూరీలు పొంగవు. త‌ర్వాత వేడి నూనెలో వేసి రెండువైపులా ఎర్ర‌గా కాల్చాలి.
 • 5. ఈ పూరీల‌ను 2,3 గంట‌ల‌పాటు గాలికి ఆర‌బెట్టాలి.

స్టఫ్ఫింగ్-1 (బటానీ స్టఫ్ఫింగ్):

 • 1. రాత్రంతా నానబెట్టిన బటానీలని కుక్కర్ లో వేసి నీళ్ళు పోసి మీడియం ఫ్లేం మీద 4-5 విసిల్స్ రానివ్వాలి. 
 • 2. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో జీలకర్ర, బిరియాని ఆకు వేసి వేయించాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి.
 • 3. ఇప్పుడు ఉల్లిముక్క‌లు వేసి మగ్గనివ్వాలి. ఆ తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా మగ్గించుకోండి
 • 4. టామాటోలు మగ్గాక మిగిలిన మసాలా పొడులు అన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసి బాగా వేయించాలి. మసాలాలు బాగా వేగాక మెత్తగా ఉడికించుకున్న బటాని నీళ్ళతో సహా వేసి ఇంకొన్ని నీళ్ళు పోసి 15 నిమిషాలు చిన్న‌మంట‌పై ఉడికించాలి. 
 • 5. 15 నిమిషాల తరువాత ఉప్పు, కారం స‌రిచూసుకొని దించేయాలి. వీటిపైన కొన్ని ఉల్లిముక్క‌లు వేసుకుంటే బ‌టానీ చాట్ రెడీ!

స్టఫ్ఫింగ్ -2

 • 1. కొత్తిమీర, పుదినా, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, అల్లం, కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్టు త‌యారు చేసుకోవాలి.
 • 2. ఈ పేస్ట్‌ని వ‌డ‌క‌ట్టి అందులో లీట‌ర్ నీళ్లు పోసి మిగిలిన మ‌సాలా పొడులు అన్నీ వేసి బాగా క‌లుపాలి.
 • 3. ఇందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేస్తే నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి రుచి చూసుకుని మసాలాలు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి.
 • 4. పూరిలో చిటికెడు ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు కొత్తిమీర తరుగు మీకు నచ్చిన స్టఫ్ఫింగ్ పెట్టి పానీ లో ముంచి ఆర‌గిస్తూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

టిప్స్:

 • పానీపూరీ కోసం చేసిన పానీ ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది.


logo