శుక్రవారం 22 జనవరి 2021
Food - Nov 28, 2020 , 00:02:32

స్ప్రౌట్స్‌ పలావ్‌

స్ప్రౌట్స్‌ పలావ్‌

ఇమ్యూనిటీ ఫుడ్‌

కావలసిన పదార్థాలు

మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌:  ఒక కప్పు, బాస్మతి బియ్యం: ఒక కప్పు, నెయ్యి: 2 టేబుల్‌ స్పూన్లు, లవంగాలు: 2, ఇలాచీ: 2, దాల్చిన చెక్క: చిన్న ముక్క, బిర్యానీ ఆకు: 1, ఉల్లి తరుగు: అర కప్పు, తరిగిన పచ్చిమిర్చి: 3, అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను, క్యాప్సికం తరుగు: అర కప్పు, టమాటా తరుగు: అర కప్పు, చనా మసాలా: అర టీ స్పూను, చాట్‌ మసాలా: అర టీ స్పూను, ఉప్పు: తగినంత, కారం: ఒక టీ స్పూను, జీలకర్ర పొడి: ఒక టీ స్పూను, ధనియాల పొడి: ఒక టీ స్పూను, నీళ్లు: మూడున్నర కప్పులు, కొత్తిమీర తరుగు: కొద్దిగా, పుదీనా: కొద్దిగా..

తయారుచేసే విధానం

స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి, కాగాక లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఉల్లి తరుగు, తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. దీనికి అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి వేయించాలి. క్యాప్సికం తరుగు, టమాటా తరుగు, మిక్స్‌డ్‌ స్ప్రౌట్స్‌ వేసి  వేయించాలి. చనా మసాలా, చాట్‌ మసాలా, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి. మూడున్నర కప్పుల నీళ్లు పోసి, బాగా మరిగిన తరువాత.. కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలిపి, ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి, మూత ఉంచి ఉడికిస్తే వేడివేడి స్ప్రౌట్స్‌ పలావ్‌ సిద్ధం.logo