బుధవారం 15 జూలై 2020
Food - Apr 23, 2020 , 19:31:50

ఆహారం ఎక్కువ‌రోజులు తాజాగా ఉండాలంటే..

ఆహారం ఎక్కువ‌రోజులు తాజాగా ఉండాలంటే..

ఆహార ప‌దార్థాలు ఎక్కురోజులు నిల్వ ఉండ‌డానికి ఫ్రిజ్ వాడ‌తాం. అందులో పెట్టినా కొన్ని త్వ‌ర‌గా పాడ‌వుతాయి. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. 

ట‌మాట :  చిన్న గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు, ఒక స్పూన్ ఆపిల్ వెనిగ‌ర్ వేసి బాగా క‌ల‌పాలి. రంధ్రాలు ఉండే  బుట్ట‌లో ట‌మాటాల‌ను ఈ మిశ్ర‌మంలో పెట్టి రెండు, మూడు రోజులు ఫ్రిజ్‌లో పెట్టాలి. త‌ర్వాత తీసి చూస్తే తాజాగా ఉంటాయి.

బ్రెడ్ : ఇది కొన్నిరోజుకు న‌ల్ల‌గా అయి పాడ‌వుతుంది. అందుకే బ్రెడ్ ప్యాకెట్‌లో ఆకుకూర కాడ‌లు రెండు వేయాలి. ప్యాకెట్‌ను మూసేసి ప‌క్క‌న పెడితే వారం వ‌ర‌కు ఫ్రెష్‌గా ఉంటుంది.

పాల‌కూర : ఆకుకూర‌లు తొంద‌ర‌గా పాడ‌వుతాయి. అందుకే వాటిని ఒక త‌డిబ‌ట్ట‌లో పెట్టి చుట్టాలి. దానిని ఒక డ‌బ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలారోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది.

పాలు :  ఇవి విరిగిపోకుండా ఉండాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసి షేక్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నాలుగు రోజుల వ‌ర‌కు ఉంటాయి.

అర‌టిపండ్లు : ఇవి తొంద‌ర‌గా పండిపోకుండా ఉండాలంట‌.. ప్లాస్టిక్ క‌వ‌ర్‌తో అర‌టిపండ్ల కాడ‌ల‌ను చుట్టి ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎక్కువ రోజులు వ‌స్తాయి.


logo