సోమవారం 25 జనవరి 2021
Food - Dec 20, 2020 , 15:13:53

చలికాలంలో ఈజీ అండ్ టేస్టీ ఫుడ్‌

చలికాలంలో ఈజీ అండ్ టేస్టీ ఫుడ్‌

హైదరాబాద్‌: చలికాలంలో ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటితో జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. అందుకే శీతాకాలంలో అల్పాహారంగా ఓట్‌మీల్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.  ఓట్ మీల్‌లో పీచు శాతం ఎక్కువ. కొవ్వు సమస్య వుండదు. బరువు తగ్గించుకోవడానికి ఆహారనియమాలు పాటించేవారు ఓట్ మీల్‌తో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.  ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా వుంటాయి. పరీక్షల సమయంలో పిల్లలకు కప్పు ఓట్ మీల్‌లో కొంచెం తేనె కలిపి ఇస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ నిర్ణీత స్థాయిలో ఉంచుతూ.. గుండె ఆరోగ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. మంచి ఫైబర్‌ కంటెంట్‌ ఇందులో ఉంటుంది. ఓట్‌మీల్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడంవల్ల హైపర్‌టెన్షన్‌ (అధికరక్తపోటు) నియంత్రణలో వుంటుంది. ఓట్స్‌లో ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలను తగ్గిస్తాయి. బరువు తగ్గానికి అవకాశముంటుంది. 

ఓట్‌మీల్‌ తయారీకి కావాల్సినవి..

  • ఒక కప్పు ఓట్స్
  • ఒక కప్పు చాకొలెట్
  • అర కప్పు పెరుగు
  • తేనే సరిపడినంత
  • 1/8 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
  • ఉప్పు సరిపడినంత
  • గింజలు, పళ్లు, నట్స్

తయారీ విధానం:

  • ఒక గిన్నెలో పైన తీసుకున్న అన్నింటిని కలపాలి..
  • ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచాలి.. 
  • ఉదయాన్నే తిన్నారంటే మీ బ్రేక్ ఫాస్ట్ అదుర్స్.. 

ఇవి కూడా చదవండి..

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కిచిడి

గుమ్మడికాయ బాదం సూప్‌

బొబ్బర్ల పాయసం

ములక్కాడ ఆవకాయ

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo