గురువారం 25 ఫిబ్రవరి 2021
Food - Jan 17, 2021 , 00:25:53

మష్రూమ్‌ కట్లెట్స్‌

మష్రూమ్‌ కట్లెట్స్‌

కావలసిన 

పదార్థాలు: మష్రూమ్స్‌: 400 గ్రా, సన్నగా తరిగిన ఉల్లిపాయ: ఒక కప్పు, నూనె: 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర: 1 టేబుల్‌ స్పూన్‌, అల్లం పేస్ట్‌: 2 టీ స్పూన్లు, ఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది) : 1 కప్పు, 

ధనియాల పొడి : 2 టీ స్పూన్లు, ఆమ్‌చూర్‌: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, పచ్చి మిర్చి : నాలుగు, గుడ్లు: 2 (బాగా గిలకొట్టినవి), మైదా: అరకప్పు, 

బ్రెడ్‌ అంచులు: నాలుగు

తయారీ విధానం: బాణలిలో నూనె వేడయ్యాక  జీలకర్ర, అల్లం పేస్ట్‌ వేసి బాగా వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్‌ను వేసి పొడిపొడిగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత ధనియాల పొడి, ఆమ్‌చూర్‌, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి వేగాక దింపేయాలి. చల్లారిన మిశ్రమంలో ఉడకబెట్టి చిదిమిన ఆలుగడ్డ కలపాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక కవర్‌పై గుండ్రంగా కానీ, కోడిగుడ్డు ఆకారంలో కానీ చేసుకొని పిండిలో దొర్లించి, తర్వాత గుడ్డు సొనలో ముంచి, పొడి చేసుకున్న బ్రెడ్‌లో పొర్లించాలి. ఇలా రెండుసార్లు చేసిన తర్వాత, వాటిని నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీస్తే సరి. రుచికరమైన మష్రూమ్‌ కట్లెట్‌ రెడీ.


VIDEOS

logo