శుక్రవారం 05 జూన్ 2020
Food - Apr 02, 2020 , 11:42:36

చిరుధాన్యాలు..దేనిలో ఏయే పోషక విలువలు

చిరుధాన్యాలు..దేనిలో ఏయే పోషక విలువలు

పెరిగిన అవగాహన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అందరికీ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే, వీటిని తినడం వల్ల ఆరోగ్యమే.. కానీ, ఇందులో ఏవి తీసుకుంటే ఏం లాభమో.. తెలుసుకుని తింటే.. అధికప్రయోజనాలు సొంతమవుతాయి.

రాగులు : శరీరానికి చలువ చేసే వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి. వీటితో అంబలి, జావ, రాగి ముద్దలాంటివి చేసుకుని తినండి. అంతేకాదు, రక్తం వృద్ధి చేసి శరీరానికి బలం ఇవ్వడంలో రాగులు బెస్ట్ ఆప్షన్.

కొర్రలు : అధికబరువుతో ఇబ్బంది పడేవారు అన్నంకి బదులు కొర్రలు వండుకుని తినండి. బరువు త్వరగా తగ్గుతారు. వీటిని తినడం వల్ల బలం రావడమే కాదు.. భవిష్యత్‌లో  ఉదర సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం వంటివి వచ్చే అవకాశాలు తక్కువ.

సామలు: ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం అధికంగా ఉండే సామలు కూడా ఆరోగ్యానికి అదనపు శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య దూరమై కాల్షియం అధికంగా పొందుతాం. అందువల్ల ఎముకలు, నరాలు బలంగా మారతాయి. పేగు క్యాన్సర్ వంటివాటిని దూరం చేసుకోవచ్చు. సామలు బాలింతల్లో పాలఉత్పత్తిని పెంపొందిస్తాయి..

ఉలవలు :   ఉలవలు ఆరోగ్యానికి ఎంతోమంచివి. మూత్రసంబంధిత సమస్యలను తగ్గించడంలో వీటికి సాటి మరేమీ లేవు. మూత్రశయంలో ఏర్పడిన రాళ్లను ఇవి కరిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చిరుధాన్యాల పోషక విలువలు (వంద గ్రాములకు)

జొన్న (సొర్ఘమ్‌)    

ప్రొటీన్‌ (గ్రా.) - 10గ్రా., పీచుపదార్థం - 4 గ్రా., ఖనిజలవణాలు - 1.6 గ్రా., ఇనుము - 2.6 మి.గ్రా., కాల్షియం - 54 మి.గ్రా.

సజ్జలు (పెర్ల్‌ మిల్లెట్‌) 

ప్రొటీన్‌ - 10.6 గ్రా., పీచు - 1.3 గ్రా., మినరల్స్‌ - 2.3 గ్రా., ఇనుము - 16.9 మి.గ్రా., కాల్షియం - 38 మి.గ్రా.

రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌) 

ప్రొటీన్‌ - 7.3 గ్రా., పీచు 3.6 గ్రా., మినరల్స్‌ 2.7 గ్రా., ఇనుము 3.9 మి.గ్రా, కాల్షియం - 344 మి.గ్రా.

కొర్రలు (ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్‌) 

ప్రొటీన్‌ - 12.3 గ్రా., పీచు - 8 గ్రా., మినరల్స్‌ - 3.3 గ్రా., ఇనుము - 2.8 మి.గ్రా., కాల్షియం - 31 మి.గ్రా.

వరిగెలు (ప్రోసో మిల్లెట్‌) 

ప్రొటీన్‌ - 12.5 గ్రా., పీచు - 2.2 గ్రా., మినరల్స్‌ - 1.9 గ్రా., ఇనుము - 0.8 మి.గ్రా., కాల్షియం - 14 మి.గ్రా.

అరికెలు (కోడో మిల్లెట్‌) 

ప్రొటీన్‌ - 8.3 గ్రా., పీచు - 9 గ్రా., మినరల్స్‌ - 2.6 గ్రా., ఇనుము - 0.5 మి.గ్రా., కాల్షియం - 27 మి.గ్రా.



logo