శనివారం 06 మార్చి 2021
Food - Jan 16, 2021 , 19:49:44

ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ రవాణా వంటి పనులకు బాధ్యత వహిస్తుంది, ఇది అన్ని భాగాలకు ఆహారాన్ని కూడా తీసుకెళ్తుంది. శరీరంలో ఉత్పత్తి చేయబడిన కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు అనేక ఇతర వ్యర్థ ఉత్పత్తులను బయటకు పంపించటానికి గుండె కూడా బాధ్యత వహిస్తుంది. ఈ అవయవం ఎంతో ముఖ్యమైనది. అయినప్పటికీ అనేక జబ్బులు, సమస్యలతో బాధపడుతున్నది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సర్వసాధారణంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎక్కువ మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని పరిశోధనలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం గుండె ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న కొన్ని ఆహారాలు గుండెకు ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. కొన్ని సాంప్రదాయ మూలికలు కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ ఐదు మూలికలు మన వంటింట్లో అందుబాటులో ఉంటున్నప్పటికీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎన్నో గుండె సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ ఐదు మూలికలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వివిధ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ 5 మూలికలను నిత్యం భోజనంలో చేర్చుకోవడం ద్వారా దవాఖానలకు తిరుగడం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

కొత్తిమీర


ఆకుపచ్చని రంగులో అందంగా కనిపించే కొత్తిమీర లేకుండా.. అలంకరించకుండా ఏ భారతీయ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కొత్తిమీర ఆహారానికి తాజాదనాన్ని జోడిస్తుంది. కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

థైమ్


థైమ్ అనేది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కనిపించే ఉప్పగా ఉండే మూలిక. దీనిని వివిధ ఆహారాలు, వంటకాల్లో ఉపయోగిస్తారు. పలు అధ్యయనాల ప్రకారం, థైమ్ అధిక రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది. గుండె జబ్బులకు రక్తపోటు ప్రధాన కారణం. దీనిని అరికట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

తులసి

ఇటాలియన్ వంటకాల్లో తులసిని చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. తులసి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక మూలిక. భారత ఉపఖండంలో దీనిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తులసిలో యూజీనాల్ ఉంటుంది. కాల్షియం చానెళ్లను నిరోధించగలదు. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని నూనెలు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. తులసిలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్త నాళాలను సడలించి.. వాటిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

పుదీనా


పుదీనా సాధారణంగా వేసవి కాలంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. నిమ్మరసం, మజ్జిగ, ఇతర పానీయాలతో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీని ప్రత్యేకమైన రుచితోపాటు వివిధ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడతాయి.

రోజ్‌మేరీ


రోజ్‌మేరీ అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన మరొక హెర్బ్. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo