ఆదివారం 24 జనవరి 2021
Food - Nov 10, 2020 , 15:31:31

బిర్యానీలో మెండుగా పోషకాలు!

బిర్యానీలో మెండుగా పోషకాలు!

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నేడు అందుబాటులోకి రకరకాలు రుచికరమైన బిర్యానీలు అందుబాటులోకి వచ్చాయి. బిర్యానీ అనేది దిగులుగా ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్థితిని తక్షణమే ఉత్సాహపరిచే వంటకం. దాని వెనుక రహస్యం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. 'బిర్యానీ' అనే పదం పెర్షియన్ పదం 'బిరియన్' నుంచి ఉద్భవించిందని, ఇది వేయించిన లేదా కాల్చినది అనే అర్థాన్ని ఇస్తుందని నిపుణులు చెప్తారు. భారతదేశంలో అనేక రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి. మన వద్ద లభించే సాధారణ రకాల బిర్యానీలలో లక్నవి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కశ్మీరీ బిర్యానీ, అవధి బిర్యానీ, మురదాబాదీ బిర్యానీ, అస్సామీ కంపూరి బిర్యానీ, కోల్‌కత్తా బిర్యానీలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

చికెన్‌ బిర్యానీకి వాడే మసాలాలు, బియ్యం ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన మసాలా దినుసులు వాడుతూ తమ ప్రాంత ప్రాముఖ్యతను కొనసాగిస్తుంటారు. వాటి కారణంగా ఆయా ప్రాంతాల బిర్యానీలకు పేరు వచ్చింది. బిర్యానీ యొక్క కేలరీల సంఖ్య మాంసం లేదా చికెన్‌ రకంపై ఆధారపడి ఉంటుంది. బిర్యానీ భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను దానిలోని పదార్థాలు మరియు రుచుల కలయిక ద్వారా తెస్తుంది. ఇది రుచి కలిగిన రెసిపీగా పేరుగాంచింది. సండే వచ్చిందంటే.. తమ పిల్లల కోసం ఎలాంటి వెరైటీ వంటకాలు చేసిపెట్టాలని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. ఎప్పుడు చికెన్, మటన్ బిర్యానీలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలతో బిర్యానీ వండిపెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు. పోషకాలు అందించడంలో రొయ్యలు బాగా ఉపయోగపడతాయి.

బిర్యానీలో పోషకాలు..

మసాలా మెరినేటెడ్ చికెన్, రుచికరమైన కుంకుమ బియ్యం కలిగిన 200 గ్రాముల బిర్యానీలో సగటున 290 కేలరీలు పోషకాలు ఉంటాయి. కొవ్వు 9.4 గ్రా, సంతృప్త 1.7 గ్రా, ట్రాన్స్ 0.1 గ్రా, కొలెస్ట్రాల్ 48 మి.గ్రా, సోడియం 419 మి.గ్రా, కార్బోహైడ్రేట్లు 31 గ్రా, డైటరీ ఫైబర్ 1.4 గ్రా, చక్కెరలు 3.2 గ్రా, పొటాషియం 462 మి.గ్రా, ప్రోటీన్ 20 గ్రా ఉంటాయి. ఒక వ్యక్తి అల్పాహారంలో కనీసం 300 కేలరీలు తినాలి. సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. బిర్యానీలో వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమపువ్వు, పసుపు, నల్ల మిరియాలు, పుదీనా ఆకు, మర్వాడీ మెంతి ఆకు, మొదలైన సుగంధ ద్రవ్యాలు అనేక పోషకాలను అందిస్తాయి. బిర్యానీలో మాంసం ముఖ్యమైన అంశం. దీనివల్ల డిష్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా, చికెన్ వంటి వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బిర్యానీ తయారీలో వినియోగించే జీలకర్ర, పసుపు, నల్ల మిరియాలు, అల్లం వంటి మసాలా దినుసుల మిశ్రమం శోథ నిరోధక లక్షణాలను కలిగివుండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే శరీర నిర్విషీకరణను ప్రోత్సహిస్తుంది. చికెన్ బిర్యానీ మీకు ఇష్టమైనప్పటికీ ఎక్కువ కేలరీలు తినకుండా ఉండటానికి మితంగా తింటే సరిపోతుంది. ఒకవేళ బిర్యానీ ఎక్కువ తిన్నట్లయితే, నాలుగు గంటలపాటు సైక్లింగ్‌ కానీ, ఆరు గంటల పాటు వాకింగ్‌ కానీ చేయడం వల్ల శరీరంలోకి వచ్చిన ఎక్కువ క్యాలరీలను కరిగించవచ్చు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo