మంగళవారం 14 జూలై 2020
Food - Jun 02, 2020 , 20:02:49

ఈ చిన్నారి చెఫ్‌.. సూపర్‌ కుక్‌

ఈ చిన్నారి చెఫ్‌.. సూపర్‌ కుక్‌

మయన్మార్‌: కరోనా వైరస్‌ పుణ్యమా అని వంటల ప్రియులు ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వంటకాలు చేయడం నేర్చుకోవడమే కాకుండా శుభ్రంగా ఆరగించి ఆనందించారు. ప్రతీ ఇంటా కొత్త వంటకాలు కనిపించాయంటే అది ఇంటర్నెట్‌ వంటకాల మహిమే అని చెప్పవచ్చు. లాక్‌డౌన్‌ సమయంలోనే చాలా మంది తమలోని నైపుణ్యాలను కూడా బయటపెట్టే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ప్రయత్నమే చేసి అందరిచేత శహబాష్‌ అనిపించుకొన్నది. 

మయన్మార్‌కు చెందిన ఎనిమిదేండ్ల వయసున్న మో మైంట్‌ మే థు.. లాక్‌డౌన్‌లో ఒక్కసారిగా పాపులర్‌ చెఫ్‌ అయిపోయింది. మయన్మార్‌కు చెందిన వంటకాలతోపాటు అన్నిరకాల నాన్‌వెజ్‌ కూరలను నోరూరించేలా చేస్తూ అలరిస్తోంది. తన కూతురు రొయ్యలతో వంటకం చేస్తున్న వీడియోను ఆమె తల్లి రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో లిటిల్‌ చెఫ్‌ పేరుతో పోస్ట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. వంట చేయడం తనకు చాలా ఇష్టమని, ఈ దిశగా తన కెరీర్‌ను మలుచుకొంటానని చెప్తుందీ చిట్టి చెఫ్‌. ఈ చిన్నారి వంటల వీడియోను ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా నెటిజెన్లు వీక్షించారు. ఈ చిన్నారి చేసే వంటకాలను ఆన్‌లైన్‌లో అమ్మకానికి కూడా పెట్టడం విశేషం. ఒక్కో వంటకాన్ని 7.20 డాలర్లకు విక్రయిస్తున్నారంటే ఈ చిన్నారి ఎంత రుచికరంగా వంటలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ పేజీని క్రియేట్‌ చేసుకొన్న ఈ పాప.. అందులో తన వంటకాలను పోస్ట్‌ చేస్తున్నది. వంటలు చేయడమే కాకుండా కుకింగ్‌ తరగతులు కూడా తీసుకొంటున్న మో మైంట్ మే థు.. భవిష్యత్‌లో మంచి చెఫ్‌గా రాణించాలని ఆశిద్దాం.logo