బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Aug 08, 2020 , 15:58:33

దిండు కింద ఇవి పెట్టుకొని ప‌డుకుంటే.. రాత్రంతా భ‌లే నిద్ర‌!

దిండు కింద ఇవి పెట్టుకొని ప‌డుకుంటే.. రాత్రంతా భ‌లే నిద్ర‌!

ఉరుకులు ప‌రుగుల బిజీ లైఫ్‌లో కాసేపు ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌డానికి కూడా టైం ఉండ‌ట్లేదు. క‌రోనా స‌మ‌యంలో ఇంటి ప‌ట్టునే ఉన్న‌ప్ప‌ట‌కీ ప‌డుకుంటే ఎవ‌రో చ‌నిపోయిన‌ట్లు, ఏదో కోల్పోయిన‌ట్లు పీడ‌క‌ల‌లు వెంటాడుతున్నాయి. మ‌రి ఇంకెప్పుడు ప్రశాంతంగా నిద్ర‌పోయేది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌న పూర్వీకులు పాటించే కొన్ని నియ‌మాలు పాటించ‌డం ఉత్త‌మం. కానీ వారు ఏవేం పాటించేవాళ్లో తెలియ‌దు క‌దా. అందుకే వివ‌రంగా ఇచ్చాం చ‌దువుకోండి.

* రాత్రిపూట నిద్ర‌ప‌ట్ట‌క‌పోతే వంటింట్లోకి వెళ్లి కొన్ని యాల‌కుల‌ను క్లాత్‌లో చుట్టి ముడివేయాలి. ఈ మూట‌ని దిండు ద‌గ్గ‌ర‌గా ఉంచితే పీడ‌క‌ల‌లు రాక‌పోవ‌డ‌మే కాకుండా ఎలాంటి భ‌యం వెంటాడ‌దు.

* యాల‌కులు లేన‌ప్పుడు రాగి పాత్ర‌లు ఉన్నా స‌రిపోతుంది. ఈ పాత్ర‌లో నీరు నింపి రాత్రిపూట దిండు ప‌క్క‌న పెట్టాలి. మ‌రుస‌టి ఉద‌యం ఈ నీటిని మొక్క‌ల‌కు పోస్తే మంచి జ‌రుగుతుంది. 

* సాధార‌ణంగా చెప్పులు మంచం కింద పెడితే పీడ‌క‌ల‌లు రాకుండా ఉంటాయంటారు. కానీ చెప్పుల స్టాండ్‌ను మాత్రం మంచానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌కుండా చూసుకోవాలి. అలాగే ప‌డ‌క‌గ‌దిని నీటిగా ఉంచుకోవాలి.  

* కొంత‌మంది నిద్ర‌పోయేట‌ప్పుడు వాస్తును అస‌లు ప‌ట్టించుకోరు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా పీడ‌క‌ల‌లు వ‌స్తాయి. అందుక‌ని ద‌క్షిణం వైపు త‌ల పెట్టి ఉత్త‌రం వైపు కాళ్లు పెట్టుకొని ప‌డుకునేలా చూసుకోవాలి.  

* నిద్ర‌పోయే ముందు ఇష్ట‌మైన దైవానికి సంబంధించిన మంత్రాల‌ను చ‌దివి ప‌డుకుంటే మంచిది.  

* ఎందుకైనా మంచిది నిద్ర‌పోయేముంద‌దు ఒక నిమ్మ‌కాయ‌ను ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. అలాగే దెయ్యం సినిమాలు, ప్ర‌మాదాల వీడియోలు, ఫోటోలు వంటి వాటిని చూడ‌కుండా ఉండండి.  

* ప‌డుకునేముందు చెడు విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి మంచి విష‌యాల గురించే ఆలోచించాలి. అలాగే కాళ్ల‌ను శుభ్రంగా క‌డిగి ప‌డుకుంటే చెడు క‌ల‌లు అసలు రావు.  

* ఈ రోజుల్లో చాలామంది మ‌హిళ‌లు జుట్టుని వ‌దిలేసుకొని తిర‌గ‌డంతోపాటు నిద్ర కూడా అలానే పోతున్నారు. అలానే వ‌దిలేసుకుంటే పీడ‌క‌ల‌లు రావ‌డం ఖాయం.   

* అలాగే క‌ప్పుకునే దుప్ప‌టి, త‌ల‌గ‌డ రెండూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 


logo