బుధవారం 28 అక్టోబర్ 2020
Food - Sep 24, 2020 , 20:38:46

హైబీపీ ఉందా..? పెరుగుతో చెక్ పెట్టేయండి!

హైబీపీ ఉందా..?  పెరుగుతో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా పెల్లెల్లో ఉండేవారికి హైబీపీ స‌మ‌స్య అంత‌గా ఉండ‌దు. ఎందుకంటే వారు నిత్యం ఇంట్లో త‌యారు చేసిన పెరుగు తింటుంటారు. పెరుగు తిన‌డం వ‌ల్ల హైబీపీ స‌మ‌స్య వాటిల్ల‌ద‌ని అమెరికాకు చెందిన బోస్ట‌న్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కుడు ఈ విష‌యంపై రీసెర్చ్ చేశారు. అందులో తేలిన విష‌యం ఏంటంటే. పాలు, పాల ప‌దార్థాల‌తో త‌యారు చేసిన ఆహార ప‌దార్థాలు తినేవారు, తిన‌ని వారి మ‌ధ్య తేడా చూస్తే ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

వారానికి ఐదారు క‌ప్పుల పెరుగు తీసుకునేవారిలో హైబీపీ వ‌చ్చే అవ‌కాశం 20 శాతం త‌క్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. అందుకూ తినే ఆహారంలో పాల ప‌దార్థాలు ఉండేలా చూసుకోమ‌ని చెబుతున్నారు. మ‌రి ఇంకేం పెరుగు అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. మంచిగా గేదె పాలు కొనుగోలు చేసి ఇంట్లోనే పెరుగు త‌యారు చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. న‌గ‌రాల్లో గేదె పాలు దొర‌క‌వు అనే మాట‌లు పోయాయి. ఎక్క‌డైనా గేదెపాలు దొరికేలా అందుబాటులోకి తీసుకొచ్చారు.  


logo