బుధవారం 02 డిసెంబర్ 2020
Food - Oct 19, 2020 , 19:14:57

ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాలు ఇవే..!

 ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాలు ఇవే..!

హైదరాబాద్: మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. అయితే మనకు ఐరన్ ఎక్కువగా అందాలంటే.. ఏయే ఆహారాలను నిత్యం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

* 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నిత్యం 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.అదే మహిళలకు అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. ఇక గర్భిణీలు 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి. 50 ఏళ్లకు పైబడిన ఎవరికైనా నిత్యం 8 మిల్లీగ్రాముల ఐరన్ సరిపోతుంది.

* పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. అలాగే పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ ఉంటుంది.

* మన శరీరానికి నిత్యం కావల్సిన ఐరన్‌లో 25 శాతం ఐరన్‌ను టమాటాలను తినడం వల్ల పొందవచ్చు. అలాగే బ్రొకొలి, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీల్లోనూ ఐరన్ ఉంటుంది.

* యాప్రికాట్స్, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర తదితర పదార్థాల్లోనూ ఐరన్ ఉంటుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఐరన్ బాగా అందుతుంది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.