శుక్రవారం 10 జూలై 2020
Food - Feb 08, 2020 , 11:25:47

29 రాష్ట్రాలు 29 రుచులు.. ఆహా ఏమి రుచి

29 రాష్ట్రాలు 29 రుచులు.. ఆహా ఏమి రుచి

భారతదేశం భిన్న సంస్కృతుల సంగమం. కేవలం సంస్కృతి, సంప్రదాయాల్లోనేకాక ఆహరపు అలవాట్లలోనూ భిన్నత్వం కనిపిస్తుంది. ఒకే వరుసలో ఉండే మూడు ఇళ్లలో మూడు వేర్వేరు వంటకాలు

భారతదేశం భిన్న సంస్కృతుల సంగమం. కేవలం సంస్కృతి, సంప్రదాయాల్లోనేకాక ఆహరపు అలవాట్లలోనూ భిన్నత్వం కనిపిస్తుంది. ఒకే వరుసలో ఉండే మూడు ఇళ్లలో మూడు వేర్వేరు వంటకాలు కనిపిస్తాయి. ప్రతి కిచెన్ దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దేశంలోని 29 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక వంట శైలులున్నాయి. వాటిలో ప్రాంతీయ వంటకాలు కూడా ఉన్నాయి. అయితే పురాతనమైన సంప్రదాయ వంటకాలు మాత్రం ఒక్కో రాష్ర్టానికి ప్రత్యేకం. భారతదేశపు పురాతన ఆహార వైవిధ్యతతో పాటు 29 రాష్ర్టాల నోరూరించే రుచులతో విందు చేసుకుందాం రండి.


జమ్మూ అండ్ కశ్మీర్

రోగాన్ జోష్, యాకిని హరిష్టా వంటి మాంసపు వంటకాలతో పాటు రుచికరమైన కశ్మీరి భోజనం, వివిధ సువాసనలతో కూడిన పానీయాలతో కలిసిన భోజనం కశ్మీరుకు ప్రత్యేకం.


పంజాబ్

విస్తృతమైన శాకాహార, మాంసాహార వంటకాలతో పాటు రిచ్, బట్టీ రుచులు, సర్సన్ కా సాగ్, మక్కి కి రోటీ, తందూరి రోటీ, పీలీ పప్పు, అన్నం, వివిధ మాంసం వంటకాలుంటాయి.


హర్యానా

హర్యానా భోజనంలో ఇంట్లో తయారైన తెల్ల వెన్న, కచ్రి కీ సాబ్జీ, ఖిచిడీ, బజ్రా / బసన్ చపట్టి, ఇంట్లో తయారు చేసిన మజ్జిగ, స్పైసీ పెరుగులు, కడి పాకోర మొదలైనవి ఉంటాయి.


హిమాచల్ ప్రదేశ్

ఈ భోజనంలో వేడి, స్పైసీ పప్పులు, కూరగాయలు, సిడు (ఇది ఒక రకమైన రొట్టె), మీటా బాట్ (పల్లీలు కలిపిన తీపి అన్నం) ఉంటుంది.


రాజస్థాన్

వీరి విస్తృతమైన భోజనంలో దల్‌బాతి చూర్మా, మిస్సి రోటి, గట్టే కి సాబ్జీ, పంచెమేలా పప్పు, లాల్ మాస్, బజ్రా రోటీ, మజ్జిగ, హల్వా వంటి మధురమైన వంటకాలు ఉంటాయి.


గుజరాత్

ఈ రాష్ట్రంలోని భోజనంలో తీపి, ఉప్పుగా ఉండే వంటకాలు, మేతి, తెప్లా, భక్రీ, కట్టి మిఠీ దాల్ (తీపి, పుల్లని పప్పు), అలూ రసిల, ఆవిరి అన్నం, బాదూషా మొదలైనవి ఉంటాయి.


మధ్యప్రదేశ్

ఇక్కడి భోజనం రుచికరమైన పోహాతో తయారవుతుంది. (సుగంధ ద్రవ్యాలతో వండిన బియ్యం రేకులు), రోగన్ జోష్, సబూదానా ఖిచిడీ, కుర్మా, చిక్ కబాబ్, అచారి గోష్ట్ మొదలైనవి ఉంటాయి. వీరి భోజనం ప్రసిద్ధ భోపాల్ పాన్ తో ముగుస్తుంది.


మహారాష్ట్ర

ఈ రాష్ట్ర భోజనం రుచికరమైన సాధారణ భోజనం. ఆమ్రాస్, కోసింబీర్, భక్రి రోటీ (మిల్లెట్ ఫ్లాట్ బ్రెడ్), పిట్లా (మందపాటి చిక్పా పిండి కూర), అమ్తి (స్పైసీ ఉప్పుగా ఉండే కందిపప్పు), మటన్ కోలాపురి, సబుదాన వడ, ఖీర్, బాసుండి వంటి వంటలుంటాయి.


గోవా

అన్నం, సీఫుడ్, మాంసపు ఆహారం, స్పైసీ గోవా వంటకాలు, సోల్ కడి, అరటి హల్వా, వేయించిన కార్మోలాస్ వంటివి గోవా ఆహార పదార్ధాలలో ఉన్నాయి.


కర్నాటక

భోజనం రుచికరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో వరి అన్నం, అక్కీ రోటీ, పప్పు, కూరగాయలు, రసం, సాంబార్, వడ, కోసంబరి (సలాడ్), రవ్వ కేసరి (డెజర్ట్), కొబ్బరి వంటలు అమోఘం.


కేరళ

కేరళవారు వంటలను ఎక్కువగా కొబ్బరినూనెతో వండుతారు. అలాగే వడ్డించడం కూడా తీపి పాయసంతో ప్రారంభిస్తారు. ఈ భోజనం సంపూర్ణ సమతుల్య భోజనం. ఇక్కడి ప్రతి వంట కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటుంది.


ఉత్తరప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ వంటల్లో శాకాహార, మాంసాహార వంటకాలకు ప్రవేశం ఉంది. వీరి భోజనంలో అనేక వెరైటీలు కనిపిస్తాయి. భర్వాన్ చికెన్ పసండా, మటన్ కోఫ్టా, ఆలూ రసిదార్, కీమ దమ్ నాన్స్, ఇమార్టి, పెడస్, బాదూషా వంటి వంటలు ఎన్నో కనిపిస్తాయి.


పశ్చిమ బెంగాల్

చేపలు, కూరగాయలు, బంగాళాదుంపలు, టొర్కరి, డోయి మాచ్, కబాబ్స్, అన్నం, పప్పులు, చోర్ చోరి, సందేశ్ మొదలైనవి బెంగాలీ వంటల్లో కనిపించే ప్రాథమిక పదార్థాలు.


ఒడిశా

ఇక్కడి భోజనం సరళమైన, తక్కువ మసాలా, కారం, నూనె కలిగి ఉండి సున్నితమైన రుచి కలిగి ఉంటుంది. ఒడియా వంటకంలో బియ్యం, చేపలు, మత్స్య ఉత్పత్తులతో కూడి ఉంటుంది.


ఛత్తీస్‌గఢ్

ఈ రాష్ట్ర భోజనంలో రాకియా బాడీ, పెథాలు, రైస్ పకోడీలు, బాఫౌరీ, ఉడికించిన అన్నం, ఫారా (వండి మిగిలిపోయిన అన్నంతో తయారు చేసిన బంతులు) ముఖ్యమైనవి.


తెలంగాణ

తెలంగాణ ప్రత్యేక రుచుల సమ్మేళనం. ఇక్కడి భోజనంలో బచ్చలికూర (చింతపండు వేసి వండుతారు), పచ్చిపులుసు(చింతపండు రసం) నాన్‌వెజ్ వంటకాల్లో చికెన్, మటన్ కూరలు, నాటు కోడి పులుసు, వేపుళ్లు వంటివి సర్వసాధారణంగా ఉంటాయి.


సిక్కిం

సిక్కిం రాష్ట్ర భోజనం ఆవిరి, వేయించిన ఆరోగ్యరకరమైన వంటకాల మిశ్రమం. దాల్ భట్ (ఉడికించిన బియ్యం, పప్పు పులుసు), తుక్పా (నూడిల్ ఆధారిత సూప్), మమోస్, ఫాగ్‌స్పాపా మొదలైనవి.


ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర భోజనం రుచితో పాటు సువాసనను కలిగి ఉంటుంది. వీరి ఆహారంలో ఎర్ర మిరపకాయల కారం వినియోగం అధికం. ఇక సాధారణంగా ఉండే భోజనంలో అన్నం, రసం, పచ్చడి, వడ, పెరుగు, పప్పు, వివిధ రకాల కూరలు తప్పకుండా ఉంటాయి.


తమిళనాడు

స్పైసీ నుంచి తీపి వరకు పలు రకాల రుచులతో కూడిన ఆహారం తమిళనాడు ప్రత్యేకం. వీరి వంటలో ప్రత్యేకమైనది సాంబారు, అలాగే రసం, సాదా అన్నం, పెరుగు, బాదం పాయసం, పోరియల్ (కర్రీ), కూటు మొదలైనవి కలిగి ఉన్న రుచుల సమ్మేళనం.


త్రిపుర

వేయించిన వంకాయ, బెర్మా, కొద్దిగా నూనెలో వేయించిన ఎండు చేపలు, టమోటా చట్నీ, కాయధాన్యాలు, బియ్యం, ముయ (వెదురుతో తయారైన), స్థానిక చేపలు, కూరగాయలు, మూలికలు ప్రధానమైనవి.


అసోం

ఈ రాష్ట్ర భోజనం రుచికరంగా ఉంటుంది. భోజనంలో మాంసాహారం, చేపలు, తాజా కూరగాయలు, ఆలూ పిట్కా, పప్పు, సాగ్ ఉంటుంది.


బీహార్

బీహార్ రాష్ట్ర భోజనంలో కబాబ్, బోటీ, చికెన్ మసాలా, సత్తు పారంత, చోఖ (మెత్తని బంగాళాదుంపలతో చేసి స్పైసీ ఆహారం), చేపల కూర, పోస్టా-డానా కా హాల్వా ఉంటాయి.


అరుణాచల్ ప్రదేశ్

టమోట-ఎర్రమిరపకాయలతో చేసిన పచ్చడి, అన్నం, మాంసం, ఉడికించిన సేంద్రీయ కూరగాయలు, వెన్న, సోయ బీన్స్ వంటి పులియబెట్టిన ఉత్పత్తుల వంటి నోరూరుంచే వంటలు వీరి భోజనంలో కనిపిస్తాయి.


మణిపూర్

మసాలా మిరపకాయతో కూడిన వంట మణిపూర్ ప్రత్యేకత. వీరి భోజనంలో అన్నం, చేపలు, ఆకు కూరలు, టాంగాంగ్ (రొట్టె), బ్లాక్ బియ్యంతో తయారు చేయబడిన ప్రత్యేకమైన చహో ఖీర్ ఉంటుంది.


జార్ఖండ్

రాష్ట్ర భోజనంలో నోరూరించే అనేక వెరైటీలు కనిపిస్తాయి. చిల్క, దుస్కా, కుర్తి దాల్, ఎర్ర బియ్యం, లాల్ సాగ్, దెహటి చికెన్, దుద్ పీతా, సత్తు కా పరాంత, ఘుగ్ని, లిట్టి చోఖ, బాదూషా మొదలైనవి.


నాగాలాండ్

నాగా భోజనం.. కూరగాయలతో కూడిన బ్రిమ్స్, మిరపకాయలు, వివిధ రకాల మాంసం, చేపలు, వాసనతో కూడిన, ఎండిన లేదా పులియబెట్టిన ఆహారపదార్థాలు.


మేఘాలయ

మేఘాలయ వేర్వేరు తెగలతో కూడిన ప్రాంతం. అందువల్ల ఇక్కడి భోజనంలో కూడా చాలా రకాలు కనిపిస్తాయి. అయితే సాధారణంగా అందరూ తీసుకునే భోజనంలో అన్నం, స్పైసీ మాంసం, చేపలతో కూడిన పదార్థాలు, ఆవిరితో వండిన మమోస్, కూరగాయలు, పిక్లిడ్ వెదురు రెమ్మలు మొదలైనవి.


మిజోరం

మిజోరం భోజనంలో ఆవిరి బియ్యంతో వండిన అన్నం, మాసంతో కూడిన ఉడికించిన కూరగాయలు, బచ్చలికూర, వెదురు షూట్, మూలికలు, కోట్ పీత (బియ్యం పిండి, అరటి తో వేయించిన ఫ్రెట్టర్లు), తీపి డిష్ మిసా, మాష్‌పూర ప్రత్యేకం.


ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ భోజనంలో ఆలూ దాల్ పకోరా, టిల్ కి చట్నీ (కొత్తిమీర, నువ్వుల విత్తనాలతో చేసినది), గహాత్ కా షోర్బా, కప్పా, ఫాను, జొలీ (పెరుగు,చిక్ పీ పిండి కూర), మీఠా బాత్, చోల్ రోటీ, లెసు, డెజర్ట్, రాట్‌లతో కూడిన రుచికరమైన భోజనం.


logo