వీటితో మధుమేహాన్ని అడ్డుకోవచ్చు!

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని రెండు కొత్త అధ్యయనాల్లో వెల్లడైంది. యూరోపియన్ పరిశోధకుల బృందం నేతృత్వంలో మొదటి అధ్యయనం జరిగింది. ఇందులో ఎనిమిది యూరోపియన్ దేశాల నుంచి పాల్గొన్నారు. వీరి మీద చేసిన ప్రయోగంలో 66 గ్రాముల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చని తేలింది.
యునైటెడ్ స్టేట్స్ నుంచి పరిశోధనా బృందం రెండవ అధ్యయనం నిర్వహించింది. ఇందులో 158,259 మంది మహిళలు, 36,525 మంది పురుషులు పాల్గొన్నారు. వీరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఏమీ లేవు. వీరికి ప్రతిరోజూ తృణధాన్యాలను అల్పాహారంగా ఇచ్చారు. వీటితోపాటు రొట్టెలు కూడా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల కూడా డయాబెటిస్ తగ్గించుకోవచ్చని కనుగొన్నారు. ఈ రెండు అధ్యయనాల్లో తేలిన విషయం ఒకటే. ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల వినియోగాన్ని పెంచాలని పరిశోధకులు సూచించారు.
తాజావార్తలు
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్‌లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం