మేతీ ముల్లంగి పప్పు

ఇమ్యూనిటీ ఫుడ్
కావాల్సినవి :
ముల్లంగి తరుగు: ఒక కప్పు, మెంతి ఆకులు: అర కప్పు, పెసరపప్పు: అర కప్పు, పసుపు: చిటికెడు , ఉప్పు: తగినంత, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర : అర టీ స్పూన్, ఆవాలు : పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు : ఒకటి, లవంగాలు : రెండు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, అల్లం తరుగు: పావు టీ స్పూన్, ఇంగువ: పావు టీ స్పూన్, కారం: ఒక టీ స్పూన్, కొత్తిమీర తరుగు: పావు కప్పు.
తయారీ :
ఒక గిన్నెలో పెసరపప్పు, ముల్లంగి తరుగు, పసుపు, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత పప్పును మెత్తగా మెదుముకోవాలి. మరోవైపు స్టవ్‌పై కడాయిలో నెయ్యి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, మెంతి ఆకులు, అల్లం తరుగు, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అవన్నీ వేగాక కొత్తిమీర వేసి దింపేయాలి. ఆ పోపును మెదుముకున్న పప్పులో వేసి ఐదు నిమిషాలు స్టవ్‌పై పెట్టి వేడి చేయాలి. అంతే, ఆరోగ్యకరమైన మేతీ ముల్లంగి పప్పు రెడీ.