బుధవారం 15 జూలై 2020
Food - Apr 18, 2020 , 13:14:31

వంటింట్లోని వ‌స్తువులే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి!

వంటింట్లోని వ‌స్తువులే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి!

వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోమ‌ని డాక్టర్లతోపాటు సీఎం నుంచి పీఎం దాక ప్రతీ ఒక్కరూ చెబతూనే ఉన్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ ఉన్న‌వారికే ఎక్కువ‌గా సోకుంద‌ని ప‌రిశోధ‌కులు తేల్చి చెప్పారు. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రూ ఈ మాట‌ను అనుస‌రించాలి అంటున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలంటే పెద్ద‌గా ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. రోగ నిరోధక శక్తిని పెంచే వస్తువులు మన వంటింట్లోనే ఉన్నాయి. అదెలాగో కింద చిట్కాలు చూడండి. 

- ప్రతి రోజూ గోరువెచ్చని నీళ్లు తాగాలి.

- పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా వంటల్లో ఉండేలా చూసుకోవాలి.

- తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి మిశ్రమంతో కూడిన కషాయం రోజుకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తాగాలి.

- ఒక గ్లాసు వేడి పాలలో అరస్పూను పసుపు వేసి రంగరించి తాగాలి. ఎన్నో ఏండ్లుగా, వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఇది తిరుగులేని చిట్కా.

- ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, లేకపోతే నెయ్యి కానీ ముక్కులో కొన్ని చుక్కలు వేసుకోవాలి.

- ఒక టేబుల్ స్పూన్‌ నువ్వుల నూనె,  వంట కోసం ఉపయోగించే కొబ్బరినూనె నోట్లో వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించాలి. ఆ తర్వాత వేడినీళ్లతో నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ చేయాలి.

- అందుబాటులో ఉంటే ఓ టేబుల్ స్పూన్ చ్యవన్ ప్రాష్ మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి ఇనుమడిస్తుంది.


logo