వీటిని పొట్టుతో తింటేనే పోషకాలు అందుతాయ్!

హైదరాబాద్: కూరగాయలు ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని చెబుతారు. వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. అయితే, చాలా కూరగాయలను మనం పొట్టుతీసేసి కూర వండుతుంటాం. కానీ, కొన్నిరకాల కూరగాయలను పొట్టుతో తింటేనే ఎక్కువ పోషకాలు అందుతాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. క్యారెట్..
క్యారెట్పైన మురికిగా ఉంటుందని పైన చెక్కి తింటుంటాం. కానీ దీనివల్ల ఎన్నో పోషకాలు కోల్పోతామట. క్యారెట్లో బీటాకెరోటిన్, ఫైబర్, విటమిన్ కే, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఫైబర్ మాత్రం క్యారెట్ పైపొరలోనే ఉంటాయట. అందుకే క్యారెట్‌ను శుభ్రంగా కడిగి తింటే శరీరానికి కావాల్సిన పీచు అందుతుంది.
2.బీట్రూట్..
బీట్రూట్ ఇది పొట్టుతో తింటే చాలా మంచిది. దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు. సూప్, సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు. బీట్ రూట్ తొక్క తింటే చాలా మంచిది. ఇది జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది.
3.దోసకాయ..
దోసకాయపై తొక్క, దాని విత్తనాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. చాలా మంది దోస గింజలు తీసుకోరు. కానీ ఇది మంచిది.. ఇది షుగర్ రాకుండా కాపాడుతుంది. అయితే, బాగా కడిగి మాత్రమే తినాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అవధుల్లేని అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే
- బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష