ఆదివారం 17 జనవరి 2021
Food - Sep 10, 2020 , 20:17:05

ప‌సుపు, నిమ్మ‌, వాము డ్రింక్‌తో 'రోగ‌నిరోధ‌క శక్తి'

ప‌సుపు, నిమ్మ‌, వాము డ్రింక్‌తో  'రోగ‌నిరోధ‌క శక్తి'

మామూలు రోజుల్లో ఎలా ఉన్నా క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. దీంతో వ‌చ్చే రోగనిరోధ‌క శ‌క్తితో క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు. ముఖ్యంగా ప‌సుపు, నిమ్మ‌కాయ‌, వాముతో త‌యారు చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల క‌రోనా మాటే ఉండ‌దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు దీంతో బ‌రువు కూడా త‌గ్గొచ్చు అంటున్నారు. మ‌రి ట‌ర్కెరిమ్-అజ్వైన్‌-లెమ‌న్ వాట‌ర్ ఎలా చేయాలి. దాని ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకోండి. 

త‌యారీ :

ఒక పాత్ర తీసుకొని అందులో గ్లాస్ నీరు పోయాలి. ఇప్పుడు అర టీస్పూన్ ప‌సుపు, అర టీస్పూన్ వాము, అర టీస్పూన తురిమిన అల్లం వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా ఉడికించాలి. ఇందులో చిటికెడు నిమ్మ‌ర‌సం వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. స‌గం మిశ్రమం వ‌చ్చేంత వ‌ర‌కు ఉంచి దించేయాలి. త‌ర్వాత దీన్ని వ‌డ‌క‌ట్టి తాగితే స‌రిపోతుంది. రుచికోసం కావాలంటే కొంచెం తేనె కూడా క‌లుపుకోవ‌చ్చు. దీని గురించి ఒక‌సారి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటే మ‌రింత మంచిది. 

ఉప‌యోగాలు :

పసుపు : జలుబు, దగ్గుతో వచ్చే బాధ‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. పసుపులో కర్కుమిన్ సమృద్ధిగా ఉంటుంది.  

వాము :  తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవ‌డానికి వాము ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది బ‌రువు త‌గ్గ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్క‌లంగా ఉన్నాయి.  

అల్లం :  అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలకు అల్లం మంచి ప‌రిష్కారం. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఫ్లూ, త‌ల‌నొప్పి, గొంతు నొప్పుల‌కు అద్భుత‌మైన ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.  

నిమ్మకాయ : బ‌రువు త‌గ్గ‌డానికి నిమ్మ‌ర‌సం భేష్‌గా ప‌నిచేస్తుంది. ఇందులో విట‌మిన్ సి పుష్క‌లంగా దొరుకుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు నిమ్మ‌ర‌సం స‌హాయం చేస్తుంది.  

తేనె : ద‌గ్గును అణిచివేయ‌డానికి తేనె ప‌నిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.