బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Sep 14, 2020 , 12:55:19

మిరియాల‌ ర‌సంతో ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం పొందండి!

మిరియాల‌ ర‌సంతో ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం పొందండి!

వ‌ర్షాలు ప‌డుతుంటే ఓ వైపు ఆనందంగా ఉన్నా ఆరోగ్యం విష‌యంలో మాత్రం కొంచెం క‌ల‌త‌గానే ఉంటుంది. ఎందుకంటే వాతావ‌ర‌ణంలో మార్పు కార‌ణంగా లేదంటే వ‌ర్షంలో త‌డ‌వ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి చిన్న స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతున్నారు. ఇవి చిన్న రోగాలే అయిన‌ప్ప‌టికీ వాటి బాధ మాత్రం ఎక్కువ‌గానే ఉంటుంది. మ‌రి ఈ రోగాల‌ను న‌యం చేయ‌డానికి ఒకే ఒక్క ఔష‌ధం. అది మిరియాల ర‌సం. దీన్ని అన్నంలో క‌లుపుకొని తాగినా లేదంటే.. గ్లాసులో పోసుకొని తాగినా గొంతు గ‌ర‌గ‌ర‌, జ‌లుబు, ద‌గ్గు వంటివ‌న్నీ ప‌రార్ అవుతాయి. మ‌రి మిరియాల ర‌సం త‌యారీ విధానం ఎలానో తెలుసుకోండి. 

మిరియాల రసానికి కావాల్సిన ప‌దార్థాలు : 

మిరియాలు : 12-15

వెల్లుల్లి రెబ్బ‌లు : 4

జీల‌క‌ర్ర : ఒక టేబుల్‌స్పూన్

నూనె : ఒక టీస్పూన్‌

ఎండుమిర్చి : 3

క‌రివేపాకు :  రెండు రెమ్మ‌లు

చింత‌పండు ర‌సం : 2 టేబుల్‌స్పూన్స్‌

ఉప్పు :  రుచికి స‌రిప‌డా

నీరు : స‌రిప‌డా

త‌యారీ : 

ముందుగా పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. త‌ర్వాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీల‌క‌ర్ర‌, మిరియాలు, వెల్లుల్లి వేసి మిక్సీ ప‌ట్టించాలి. ఎండుమిర్చి వేగిన త‌ర్వాత క‌రివేపాకు, మిరియాల పేస్ట్ వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. స్ట‌వ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి వెల్లుల్లి సువాస‌న వ‌చ్చేంత వ‌ర‌కు వేయించాలి. ఆ త‌ర్వాత చింత‌పండు గుజ్జు, రుచికి స‌రిప‌డా ఉప్పు, నీరు పోసి బాగా ఉడికించాలి. మిశ్ర‌మం నురుగు ప‌ట్టిన త‌ర్వాత స్ట‌వ్ క‌ట్టేసుకుంటే స‌రిపోతుంది. ఇక అంతే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల ర‌సం రెడీ! వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు ర‌సం తాగితే శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. 


logo