శుక్రవారం 15 జనవరి 2021
Food - Jul 22, 2020 , 22:08:26

దంతాలు పుచ్చిపోవ‌డానికి గల కార‌ణాలివే..!

దంతాలు పుచ్చిపోవ‌డానికి గల కార‌ణాలివే..!

ఏ నొప్పినైనా భ‌రించ‌వ‌చ్చు గాని ప‌ళ్లు పుచ్చితే ఆ నొప్పి వ‌ర్ణ‌ణాతీతం. ఇది చెప్పేవాళ్ల క‌న్నా భ‌రించేవాళ్ల‌కే బాగా తెలుసు. రాత్రి స‌మ‌యంలో ప‌డుకునేట‌ప్పుడు బ్ర‌ష్ చేయ‌కుండా ప‌డుకుంటే ప‌ళ్లు పుచ్చిపోతాయ‌ని మాత్ర‌మే చాలామందికి తెలుసు. ఇది ఒక‌టే దీనికి కార‌ణం కాదు. ఇందుకు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ బాధ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అవేంటంటే..

దంతాలు పుచ్చ‌డానికి కార‌ణాలు :

* చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉండే ఐస్‌క్రీం, కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ప‌ళ్లు పుచ్చుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

* మార్కెట్లో దొరికే చాలా చాక్లెట్లు పంటికి అతుక్కుపోతాయి. దీనివ‌ల్ల ప‌ళ్లు ఎక్కువ‌గా పుచ్చుతాయి. 

* డీ హైడ్రేష‌న్ వ‌ల్ల శ‌రీరం ఎండిపోవ‌డ‌మే కాకుండా నోరు కూడా ఎండిపోతుంది. ఇలానే ఎక్కుసేపు ఉండ‌డం వ‌ల్ల కూడా దంతాలు పుచ్చిపోతాయి. 

* విట‌మిన్ డీ త‌క్కువ‌గా ఉన్న వారికి కీళ్ల‌నొప్పులు రావ‌డ‌మే కాకుండా ప‌ళ్లు కూడా పుచ్చుతాయి. 

* జీర్ణ స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా గుండెలో మంట అధికంగా ఉంటుంది. దీనికి బోన‌స్‌గా ప‌ళ్లు పుచ్చుతాయి. 

* ప‌సిపిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లుల‌కు ప‌ళ్లు పుచ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి వీరు త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ రెండుసార్లు ప‌ళ్ళు తోముకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.