బుధవారం 27 జనవరి 2021
Food - Jul 21, 2020 , 14:01:10

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఊర‌గాయ!

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఊర‌గాయ!

ఊర‌గాయ అన‌గానే భార‌తీయుల‌కు ముందుగా గుర్తొచ్చేది ఆవ‌కాయ‌, చింత‌కాయ‌, ఉసిరికాయ ఊర‌గాయ‌లే. ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో ఇవి త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. వేడి వేడి అన్నంలో కొంచెం ఊర‌గాయ, కాస్త నెయ్యి వేసుకొని తింటే అహా ఆ టేస్టే వేరు. ఒకసారి చేసి నిల్వ ఉంచుకుంటే ఏడాది పొడ‌వునా తినొచ్చు. కాక‌పోతే ఊర‌గాయ‌లు అప్పుడ‌ప్పుడు కొంచెం తింటుంటేనే బాగుంటుంది. రోజూ తింటే శ‌రీరంలో వేడి అధిక‌మ‌వుతుంది. అయితే చాలామందికి తెలియ‌ని మ‌రో ఊర‌గాయ కూడా ఉంది. అదే ప‌సుపు ఊర‌గాయ‌. ఇది మంచి టేస్ట్‌తో పాటు ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ని కూడా అందిస్తుంది. అంతేకాదు ఇది చేయ‌డం కూడా చాలా ఈజీ. 

ప‌సుపులోని యాంటీ-ఆక్సిడెంట్స్ శ‌రీరానికి ర‌క్ష‌ణ క‌వ‌చంల‌లా ప‌నిచేస్తుంది. అంతేకాదు జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. అలాగే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ని మెరుగు ప‌రుస్తుంది. కీళ్ళనొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. అలాగే మిరియాలు, అల్లం, నిమ్మ‌కాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆరోగ్యానికి ఎంత మంచిదైనా రోజుకి రెండుసార్లు క‌న్నా ఎక్కువ తిన‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. మ‌రి ప‌సుపు ఊర‌గాయ ఎలా త‌యారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన ప‌దార్థాలు :

- ఫ్రెష్ ప‌సుపు కొమ్ములు

- ఆరెంజ్ ప‌సుపు కొమ్ములు

- అల్లం

- నిమ్మ‌కాయ‌

- మిరియాలు

త‌యారీ : 

ముందుగా నిమ్మ‌కాయ‌ల‌ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వాట‌న్నింటినీ క‌ట్ చేసుకోవాలి. త‌ర్వాత మిరియాల‌తో పాటూ ఒక జార్‌లో వేసి ఐదు లేదా ప‌ది రోజుల పాటు బాగా ఎండ‌బెట్టాలి. అంతే ఆ త‌ర్వాత ఊర‌గాయ‌ని స్టోర్ చేసి పెట్టుకుంటే స‌రిపోతుంది. logo