శనివారం 16 జనవరి 2021
Food - Sep 29, 2020 , 19:08:24

అధిక శక్తి నిచ్చే ఆహారం గురించి తెలుసా?

అధిక శక్తి నిచ్చే ఆహారం గురించి తెలుసా?

హైదరాబాద్ : మాములుగా ఉన్నప్పుడు కన్నా, వ్యాయామాలు చేసినప్పుడు, జిమ్ కు వెళ్ళినప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. అతువంటి సమయంలో ఎక్కువ ఆహారం తినటం కన్నా అధిక శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవటం మేలు. అవేంటంటే..! 

బాదంలు :వ్యాయామం సందర్బంగా కండరాలు బలహీనం కాకుండా వీటిలో ఉండే ప్రోటిన్స్ కాపాడతాయి. అలాగే కండరాలకు కావాల్సినంత శక్తిని ఇస్తాయి.

బ్రౌన్ రైస్: వీటిలోని కార్బో హైడ్రేట్స్,ఫైబర్ ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. పాలిష్డ్ బియ్యం కన్నా బ్రౌన్ రైస్ తీసుకోవటం మంచిది.

బీట్ రూట్ జ్యూస్: ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. చాలా మంది క్రీడాకారులు ఈ జ్యూస్ ను నిత్యం తీసుకుంటారు. రోజుకి ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే పలు రుగ్మతలు దరిచేరవని నిపుణులు చెప్పుతున్నారు.

నువ్వులు: వీటిలో మాగ్నిషియం,కాపర్,కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. కీళ్ళనొప్పులను తగ్గించే శక్తి ఉంది. వీటిని ఆహారం ద్వారా తీసుకుంటే ఎముకలు,కీళ్లు శక్తివంతముగా తయారవుతాయి.

పీనట్ బట్టర్: పీనట్ బట్టర్ తీసుకోవటం వలన ఆరోగ్యం చెడిపోతుందని చాలా మంది నమ్మకం. కానీ ఇది వాస్తవం కాదని నిపుణులు చెప్పుతున్నారు. దీన్ని తీసుకోవటం వలన ఎక్కువ సేపు శక్తిని కలిగి ఉండవచ్చు. ఉదయం సమయంలో ఓట్మిల్ తో కలిపి దీనిని తీసుకోవటం వలన రోజంతా ఉల్లాసంగా,ఉత్సాహంగా ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.