సోమవారం 25 జనవరి 2021
Food - Sep 09, 2020 , 20:14:34

బ్రేక్‌ఫాస్ట్‌గా బాదంపప్పు తినేవాళ్ల‌కో శుభ‌వార్త‌! వారికి ఈ ముప్పు రాదు

బ్రేక్‌ఫాస్ట్‌గా బాదంపప్పు తినేవాళ్ల‌కో శుభ‌వార్త‌! వారికి ఈ ముప్పు రాదు

మ‌ధ్యాహ్న భోజ‌నానికి ఎన్ని ర‌కాల వంట‌లైనా చేసుకోవ‌చ్చు కానీ, ప్ర‌తిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అంటేనే చిరాకు వ‌స్తుంది. ఏది చేసుకున్నా అందులోకి చెట్నీ లేదా క‌ర్రీ ఉండాలి. లేదంటే తిన‌లేం. ఇదంతా ఎవ‌రు చేస్తారులే అని కొంద‌రు బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు. అలా చేస్తే అస‌లుకే మోసం అవుతుంది. లేనిపోని రోగాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే అంత క‌ష్ట‌ప‌డ‌కుండా చాలామంది డ్రైఫ్రూట్స్ తింటున్నారు. అందులో ముఖ్యంగా బాదంప‌ప్పు తినేవారికి గుండెకు సంబంధించిన ఎలాంటి రోగాలు ద‌రిచేర‌వంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మానసిక ఆందోళనకు గురైనప్పుడు గుండె వేగం ఆక‌స్మాత్తుగా పెరుగుతుంది. దీన్ని నిరోధించ‌డానికి బాదంప‌ప్పు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని నివారించాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక‌టి వ్యాయామం చేయ‌డం. రెండోది మంచి ఆహారం తీసుకోవ‌డం. ఇవ‌న్నీ ఎందుకులే అనుకుంటే క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరు వారాల‌పాటు బాదంప‌ప్పును టిఫిన్‌గా తీసుకొని జ‌రిగే మార్పును మీరే గ‌మ‌నించండి. 


logo