ఆదివారం 12 జూలై 2020
Food - Jun 02, 2020 , 15:34:52

అవిసెలతో కలిగే మేలు ఎంతో తెలుసా?

అవిసెలతో కలిగే మేలు ఎంతో తెలుసా?

అవిసె గింజలు గ్రామీణ నేపథ్యమున్న ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అవిసె గింజలతో లడ్డూలు, గింజల పొడి, బర్ఫీ, ఇలా ఎన్నో రుచికరమైన పదార్థాలు తయారు చేసుకోవచ్చు. అవిసెల్ని తింటే ఆరోగ్యానికి లాభమెలా చేకూరుతుందంటే..

 యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, ప్రోటీన్స్‌, ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌ ఇలా ఎన్నో అవిసె గింజల్లో దాగుంటాయి. ఈ గింజలు జీర్ణ వ్యవస్థ మెరుగుదల, బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గింపు, గుండె 

జబ్బులను నివారించడం వంటి ఎన్నో ప్రయోజనాల్ని కల్పిస్తుంది. అవిసె గింజల్లోని పోషకాలు గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు సహాయపడుతాయి. 

ధమనుల్లో మంటను తగ్గిస్తాయి. కణతుల పెరుగుదలను తగ్గిస్తాయి. తరచూ అవిసెలు తినే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువ. అవిసె గింజల్ని ఉడికించి ప్రతిరోజూ 

ఉదయం పూట తీసుకోవడం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అవిసె గింజలను క్రమంగా తినడం వల్ల స్త్రీలలో రొమ్ము 

క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇవి మాత్రమే కాదు. వీటివల్ల మరిన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.logo