మంగళవారం 19 జనవరి 2021
Food - Sep 18, 2020 , 13:34:18

ప‌సుపు, అశ్వ‌గంధ డ్రింక్ తాగితే చాలు.. ఎలాంటి వైర‌స్ ద‌రిచేర‌దు!

ప‌సుపు, అశ్వ‌గంధ డ్రింక్ తాగితే చాలు.. ఎలాంటి వైర‌స్ ద‌రిచేర‌దు!

క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌తిఒక్క‌రూ ఇమ్యునిటీ వ‌వ‌ర్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. క‌షాయం ఒక‌టే కాకుండా వివిధ డ్రింక్‌ల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్యంగా హెర్బ‌ల్ టీలకు ఎక్కువ ప్ర‌ధాన్య‌త ఇస్తున్నారు. హెర్బ‌ల్ టీని చాలా ర‌కాలుగా చేసుకుంటే. ఇందులో ర‌క‌ర‌కాల ఇంగ్రీడియంట్స్‌ను ఉప‌యోగిస్తారు. ప‌సుపు, అశ్వ‌గంధ వేసి కూడా టీ త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ డ్రింక్ తాగితే చాలు ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవ‌స‌రం లేని ఈ డ్రింక్‌కు త‌యారీ విధానం కూడా సింపుల్‌. మ‌రి అదెలాగో చూసేద్దాం.

కావాల్సిన ప‌దార్థాలు :

ప‌సుపు : ఒక టీస్పూన్‌

అశ్వ‌గంధ వేరు నుంచి తీసిన ఎక్ట్స్రాక్ట్‌

ములేథీ పౌడ‌ర్ : ఒక టీస్పూన్‌

నీరు :  ఒక క‌ప్పు

త‌యారీ :

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి క‌ప్పు నీరు తీసుకోవాలి. ఇందులో ప‌సుపు, అశ్వగంధ ఎక్ట్స్రాక్ట్‌, ములేథీ పౌడ‌ర్ వేసి మూడు నిమిషాల‌పాటు మ‌రిగించాలి. త‌ర్వాత స్ట‌వ్ క‌ట్టేసి దించేయాలి.  ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టి వేడి వేడిగా తాగాలి. వ‌ట్టిగా తాగ‌లేక‌పోతే కొంచెం తేనె క‌లుపుకున్నా మంచిదే. మ‌రీ ఎక్కువగా కాకుండా త‌క్కువ మోతాదులో త‌ర‌చూ ఈ డ్రింక్ తాగుతుంటే ఎలాంటి రోగాలు ద‌రిచేర‌వు.