ఆదివారం 01 నవంబర్ 2020
Food - Sep 30, 2020 , 17:03:49

డ‌యాబెటిస్‌కు 'హైబిస్క‌స్ హెర్బ‌ల్ టీ' చ‌క్క‌ని ఔష‌ధం

డ‌యాబెటిస్‌కు 'హైబిస్క‌స్ హెర్బ‌ల్ టీ' చ‌క్క‌ని ఔష‌ధం

మందారం చెట్టు ఇంట్లో ఉంటే చాలామంచిద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులో విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, ఫాస్ప‌ర‌స్‌, టెట‌రిక్‌, క్యాల్షియం, ఐర‌న్‌, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ , నైట్రోజ‌న్, ఆక్సీలిక్ యాసిడ్ వంటివి పుష్క‌లంగా ల‌భిస్తాయి. దీని ఆకులు జుట్టు పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డితే వాటి పువ్వులు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఆకులు అంటే.. రుబ్బుకొని జుట్టుకు ప‌ట్టిస్తాం. మ‌రి పువ్వులు ఏ విధంగా ఆరోగ్యానికి ఉప‌యోగ‌పడ‌తాయో చాలామందికి తెలియ‌దు.

దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందార పువ్వుల‌తో 'టీ' చేసుకొని తాగితే మంచిది. ముందుగా మందార పువ్వుల‌ను బాగా ఎండ‌బెట్టాలి. త‌ర్వాత నీటిని బాగా మ‌రిగబెట్టాలి. అందులో ఎండిన మందార పువ్వుల‌ను వేయాలి. వీటిలోనే చ‌క్కెర‌, కొంచెం టీపొడి క‌లుపుకొని టీ మాదిరిగా త‌యారు చేసుకొని సేవించాలి. దీనిని 'హైబిస్క‌స్ హెర్బ‌ల్ టీ' అంటారు. దీన్ని ప్ర‌తిరోజూ తాగితే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు. టీ తాగ‌డం వ‌ల్ల బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్‌, మూత్ర‌పిండాలు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు ఔష‌ధంలా ప‌నిచేస్తుంది.